Govt raises MSP on wheat by Rs 110: కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల సంక్షేమం కోసం, రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా పలు పంటల మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022-24 ఆర్థిక సంవత్సరం రబీ సీజన్ కు గానూ.. 6 పంటలకు మద్దతు ధరలను పెంచింది. గోధుమ కనీస మద్దతు ధర క్వింటాల్ కు రూ. 110 పెంచింది. దీంతో క్వింటాల్ గోధుమల ధర రూ. 2,125కు చేరింది. ఇదే విధంగా అవాలకు రూ.400 మద్దతు ధర పెంచింది. దీంతో క్వింటాల్ ఆవాల ధర రూ. 5,450కు పెరిగింది.
Read Also: Gujarat: షాకింగ్ ఘటన.. డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీఈఏ) ఎంఎస్పీ పెంపు నిర్ణయం తీసుకున్నారు. గోధుమ, ఆవాలు రబీ సీజన్ లో ప్రధాన పంటలుగా ఉన్నాయి. దీంతో ఈ రెండు పంటలకు మద్దతు ధర పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్, రబీ కాలాల్లో సాగయ్యే 23 పంటలకు కేంద్ర మద్దతు ధరలను నిర్ణయిస్తూ ఉంటుంది. 2021-22 ఏడాదిలో ప్రధాన పంట అయిన గోధుమకు రూ. 2,015 మద్దతు ధర ఉండేది ప్రస్తుతం ఎంఎస్పీ పెంచడంతో క్వింటాల్ ధర రూ. 2,125కు చేరింది. గోధుమ ఉత్పత్తి వ్యయం క్వింటాల్ కు రూ. 1,065గా కేంద్రం అంచానా వేస్తోంది.
మిగతా పంటల విషయానికి వస్తే బార్లీకి మద్దతు ధర రూ. 100 పెంచింది. దీంతో క్వింటాల్ బార్లీ ధర రూ. 1735కు చేరింది. ఇదే విధంగా శెనిగలకు రూ. 105 పెంచింది. క్వింటాల్ శనిగల ధర రూ. 5,335కు చేరింది. కందులకు రూ. 500 మద్దతు ధర పెంచింది. క్వింటాల్ కందుల ధర రూ. 6,000 కు చేరుకుంది. సన్ ఫ్లవర్ మద్దతు ధర రూ. 209కి పెంచింది. క్వింటాల్ సన్ ఫ్లవర్ ధర రూ.5650కు చేరుకుంది.