దేశవ్యాప్తంగా లౌడ్ స్పీకర్ల వివాదం చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయంగా రచ్చ జరుగుతోంది. మసీదుల్లో, ఇతర ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా చర్చనీయాంశం అయింది. తాజాగా లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ బస్వరాజ్ బొమ్మై సర్కార్ నిర్ణయం తీసుకుంది.
అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత తప్ప లౌడ్ స్పీకర్లు వినియోగించరానది ఉత్తర్వులు జారీ చేసింది. ఆడిటోరియం, కాన్ఫరెన్స్ రూమ్ లు, కమ్యూనిటీ హాల్స్ తో పాటు మూసి ఉన్న ప్రాంగణాల్లో తప్పితే ఇతర బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను వినియోగించరాదని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో శబ్ధ తీవ్రత 10 డెసిబల్స్ కు మించరాదనే సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక సర్కార్ చెబుతోంది.
ఇటీవల కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కర్ణాటకలో హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. విద్యాలయాలకు హిజాబ్ ధరించి రావడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్ట్ కూడా సమర్థించింది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరింది. ప్రస్తుతం లౌడ్ స్పీకర్ల వివాదం కర్ణాటకలో లౌడ్ స్పీకర్ వివాదం నడుస్తోంది. అయితే ప్రతిపక్షాలు, ఓ వర్గం ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తున్నాయి. ఇక మహారాష్ట్రలో కూడా లౌడ్ స్పీకర్ వర్సెస్ హనుమాన్ చాలీసా వివాదం నడుస్తోంది. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే, శివసేన సర్కార్ మధ్య లౌడ్ స్పీకర వివాదం ముదురుతోంది. మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రార్థనలు వినిపిస్తే దీనికి ప్రతిగా పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా వినిపిస్తామంటూ ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు రాజ్ ఠాక్రే. మరోవైపు ఈ వివాదంలోకి అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా కూడా చేరారు. ఇటీవల సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించి అరెస్ట్ అయ్యారు.