అక్రమ రవాణాకు ఎయిర్ పోర్టులు , సీ పోర్టులు వేదికలు అవతున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోని పలు విమానాశ్రాయాల్లో డ్రగ్స్, బంగారం పట్టుబడుతున్నాయి. విదేశాల నుంచి దేశానికి అక్రమంగా వీటిని రవాణా చేస్తున్న సమయంలో అధికారులు పట్టుకుంటున్నారు. దీనికి తోడు సముద్రమార్గాల ద్వారా అక్రమార్కులు డ్రగ్స్ ను దేశంలోకి తీసుకువస్తున్నారు.
తాజా దేశంలో బంగారం, డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడగా… తమిళనాడు కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్ ను పట్టుకున్నారు అధికారులు. ఈ రెండు ఘటనల్లో స్మగ్లింగ్ కు పాల్పడుతున్నవారు మహిళలే. ఇద్దరు ఖి ‘లేడీ’లు దేశంలోకి అక్రమంగా డ్రగ్స్, బంగారం తీసుకురావడానికి ప్రయత్నించి బుక్కయ్యారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఫ్రెంచ్ లేడీ వద్ద 73.5 లక్షల విలువ చేసే 1645 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. బంగారాన్ని గాజులు, చైన్స్ తో పాటు కాయిన్స్ గా తయారు చేసి లగేజ్ బ్యాగ్ లో తరలించే ప్రయత్నం చేసింది. కస్టమ్స్ తనిఖీల్లో బంగారం అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికురాలిపై కేసు నమోదు చేేసి దర్యప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.
ఇదిలా ఉంటే తమిళనాడు కోయంబత్తూర్ లో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు మే 6న షార్జా నుంచి కోయంబత్తూర్ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి 81 క్యాప్సూల్స్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా క్యాప్సూల్స్ లో డ్రగ్స్ ప్యాక్ చేసి మింగింది. అయితే అనుమానం వచ్చిన అధికారులు సదరు మహిళను పరీక్షించగా… కుడుపులో దాచిన 81 క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మెథాంఫేటమిన్ డ్రగ్స్ గా అధికారులు గుర్తించారు.