కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పండిత్ సుఖ్ రామ్(95) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న సుక్ రామ్ న్యూఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ రోజు కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అనిల్ శర్మ తెలియజేశారు.
మే 4న బ్రెయన్ స్ట్రోక్ కు గురయిన మాజీ కేంద్రమంత్రి ఆరోగ్య క్షీణిస్తూ వచ్చింది. గత శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ హస్పిటల్ లో చేర్చారు కుటుంబ సభ్యులు. చికిత్స తీసుకుంటున్న సమయంలో సోమవారం తీవ్ర స్థాయిలో హర్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్న సమయంలో ఆయన కన్నుమూశారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ చొరవ తీసుకుని ప్రభుత్వ హెలికాప్టర్ ద్వారా సుఖ్ రామ్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా ఉన్న సుఖ్ రామ్ 1993 నుంచి 1996 వరకు కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా పనిచేవారు. హిమచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. లోక్ సభ ఎన్నికల్లో మూడు పర్యాయాలు గెలుపొందారు. కాగా…2017లో కాంగ్రెస్ పార్టీని విడిన సుఖ్ రామ్ తిరిగి 2019లో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరారు. సీనియర్ లీడర్ చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.