Asani Cyclone: ఏపీకి అలెర్ట్.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అసని’ తీవ్ర తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ క్రమంగా తీరాన్ని సమీపిస్తోంది. కాకినాడ తీరం వద్ద తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. యానాం-కాకినాడ తీరాన్ని తాకిన తర్వాత మళ్లీ తుఫాన్ సముద్రంలోకి వెళ్లనుంది అసని తుఫాన్. దీంతో ఏపీలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతం కాకినాడకు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందుగా అసని తుఫాన్ గమనాన్ని బట్టి ముందుగా అది ఏపీ తీరాన్ని తాకదని అనుకున్నప్పటికీ… మళ్లీ దిశ మార్చుకుని కాకినాడ తీరం వైపు పయణిస్తోంది.
తీవ్ర తుఫాన్ కాకినాడ తీరాన్ని తాకననున్న అసని తుఫాన్… తీరం వెంబడి విశాఖ వైపు పయణించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆతర్వాత ఉత్తరం-ఈశాన్య దిశగా కదులుతూ మచిలీపట్నం, నర్సాపూరం, యానాం, కాకినాడ, తుని, విశాఖపట్నం తీరాల వెంబడి కదులుతూ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాన్ ప్రభావం వల్ల కాకినాడ, గంగవరం, భీముని పట్నం పోర్టులకు 10 వనెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగతా పోర్టులకు ఎనిమిదో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణ, పశ్చిమ గోదావరి, గుంటూర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. తుఫాన్ ప్రభావం తగ్గి రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖ మీదుగా వెళ్లే రైళ్లను రద్దు చేయడంతో పాలు, విశాఖకు వచ్చే విమానాలను రద్దు చేశారు.
Also Read
తుఫాన్ వల్ల ఏపీతో పాటు ఒడిశా, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ నేపథ్యంలో ఏపీ సర్కార్ అలెర్ట్ అయింది. స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్ 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 6 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ టీములను సిద్ధం చేశారు.
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!