వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుందని…వ్యవసాయం బాగుండాలి… అన్నదాతను గౌరవించాలని… ప్రపంచ వ్యవసాయానికి నీటి ప్రాముఖ్యత తెలిపిన నేల ఓరుగల్లు అని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. 11 వ శతాబ్దంలోనే గొలుసుకట్టు చెరువులు, కుంటలు, ప్రముఖ ఆలయాలను కాకతీయ రాజులు నిర్మించారని […]
ఆంధ్ర ప్రదేశ్ కు ఎంతో కీలమైన పోలవరం ప్రాజెక్ట్ పై ఢిల్లీలో ఈ రోజు కీలక సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లు, నిధులపై ఈ సమావేశం జరుగుతోంది. కేంద్ర జల్ శక్తి సలహాదారు వెదిరే శ్రీరాం అధ్యక్షతన పోలవరం డిజైన్ల పై సమావేశం ప్రారంభం అయింది. గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటంతో పాటు కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను పటిష్ఠం చేయడంపై […]
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపీ మసీదు అంశం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ ఉత్తర్వుల మేరకు మే 14-16 వరకు మసీదులో వీడియో సర్వే నిర్వహించి మే 17న రిపోర్ట్ ఇవ్వాలని కోర్ట్ నియమించిన కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ రోజే వీడియోగ్రఫీ సర్వే వివరాలను కోర్ట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే జ్ఞానవాపీ మసీదులోని వజూ ఖానాలోని బావిలో శివలింగ భయటపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీడియో సర్వేకు మరింత సమయం కావాలని కోర్ట్ కమిషనర్లు వారణాసి […]
ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. దీంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా భారీ ఎత్తున బెట్టింగులు పెడుతున్నారు. ఒక్కో మ్యాచ్ కు కొన్ని వందల కోట్లు చేతులు మారుతున్నాయి. అధికారులు బెట్టింగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నా బెట్టింగ్ కు ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్ క్రికెట్ బెట్టింగ్ పై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని నాలుగు చోట్ల సోదాలు చేశారు సీబీఐ అధికారులు. 2103 నుంచి పాకిస్తాన్ కేంద్రంగా ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు […]
పీకల్లోతు ఆర్థిక సమస్యలు, అంతర్గత, రాజకీయ సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్ లో నియోజవర్గాల డీలిమిటేషన్ పై వ్యతిరేఖంగా పాక్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేఖించింది ఇండియా. భారత దేశంలో భాగం అయిన జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కు వ్యతిరేఖంగా పాక్ చేసిన తీర్మానాన్ని హస్య తీర్మాణంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ తో పాటు భారత భూభాగాలతో […]
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్ ను నియమించారు. ఇంతకు ముందు ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర పదవి కాలం నేటితో ముగుస్తుండటంతో కొత్త నియామకం చేపట్టారు. మే 15 నుంచి రాజీవ్ కుమార్ నియామకం అమలులోకి రానుంది. ముగ్గురు సభ్యులు ఉండే పోల్ ప్యానెల్ లో సుశీల్ చంద్ర […]
రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ‘నవ కల్పన్ శింతన్ శిబిర్’ నిర్వహిస్తోంది. వరస పరాజయాలను నుంచి బయటపడేందుకు పార్టీకి కొత్త రూపు సంతరించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బీజేపీ వంతు వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా నేటి నుంచి బీజేపీ ‘ చింతన్ శిబిర్’ ను ప్రారంభించనుంది. 2022 ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ఉన్న నేపథ్యంతో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించడానికి ఈ చింతన్ శిబిర్ ను […]
త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మానిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన త్రిపురకు 11 ముఖ్యమంత్రి. శనివారం అనూహ్యంగా సీఎంగా ఉన్న బిప్లవ్ కుమార్ దేబ్ రాజీనామా చేయడంతో… బీజేపీ శాసన సభ పక్షంగా కొత్త సీఎంగా మానిక్ సాహాను ఎన్నుకున్నారు. ఆదివారం రాజధాని అగర్తలతో గవర్నర్ సత్యదేవ్ నరేన్ ఆర్య, మానిక్ సాహాతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యసభ సభ్యుడైన సాహాను అనూహ్యంగా సీఎం పదవి వరించింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు […]
మధ్య ప్రదేశ్ లో శనివారం దారణం చోటు చేసుకుంది. గుణ జిల్లా సాగా బర్ఖేగా అటవీ ప్రాంతంలో కృష్ణజింకలను వేటాడుతున్నరనే పక్కా సమాచారంలో వెళ్లిన ముగ్గురు పోలీస్ అధికారులను వేటగాళ్లు కాల్చి చంపారు. రాజధాని భోపాలకు 160 కిలోమీటర్ల దూరంలోని ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. వేటగాళ్ల కాల్పుల్లో ఎస్సై రాజ్ కుమార్ జాతవ్, హెడ్ కానిస్టెబుల్ సంత్ రామ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ మరణించారు. ఈ ఘటనపై మధ్య […]
అకాల వర్షాలు అస్సాంను ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల అస్సాంలోని 6 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించాయి. వాగులు, నదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరుగిపడుతున్నాయి. ఈ ఏడాదిలో తొలిసారి అస్సాంను వరదలు ముంచెత్తాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నిన్న డిమా హసావో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. డిమా హసావో జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. […]