ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అనిల్ బైజల్ బుధవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే అనిల్ బైజల్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ కు ఆయన రాజీనామాను సమర్పించారు. ఢిల్లీకి సుదీర్ఘ కాలం ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేశారు. 2016 డిసెంబర్ 31న పదవీ బాధ్యతలు చేపట్టిన బైజల్ ఐదేళ్ల నాలుగు నెలలు ఎల్జీగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ […]
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్టు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇదిలా ఉంటే మసీదులో ఉన్న బావితో శివలింగం బయటపడిందని తెలుస్తోంది. నిజానికి సర్వే రిపోర్టును ఈ నెల 17న వారణాసి కోర్టుకు అందించాలి… అయితే మసీదులోని వాజుఖానా బావిలో శివలింగ ఆకారం బయటపడటంతో సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రెండు రోజులు గడువు […]
సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని పోలీసులకు సూచించారు డీజీపీ మహేందర్ రెడ్డి. జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ బుక్ ను ఆవిష్కరించారు మహేందర్ రెడ్డి. సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై, ఐటీ ఇండస్ట్రీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ పై జిల్లాలఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో డీజీపీ […]
భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. దేశంలో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగిత, మతహింసలపై ట్వీట్ చేశారు. శ్రీలంక, ఇండియా ఆర్థిక పరిస్థితికి సంబంధించి గ్రాఫ్ లతో సహా ట్విట్టర్ లో పెట్టారు. 2011 నుంచి 2017 వరకు శ్రీలంక, భారత్ దేశాల్లో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగం, మతహింస ఎలా ఉందనే దానిపై ట్వీట్ చేశారు. భారత దేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే […]
రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఎంత హెచ్చరించినా… నార్డిక్ దేశాలు స్వీడన్, ఫిన్లాండ్ నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్( నాటో) చేరడానికే మొగ్గు చూపాయి. తాజాగా బుధవారం నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్ బర్గ్ ధ్రువీకరించారు. నాటోలో చేరితే మాస్కో నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని రష్యా హెచ్చరించానా ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గలేదు. ఇదిలా ఉంటే స్వీడన్, ఫిన్లాండ్ […]
శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తమ ప్రజలకు నిత్యావసరాలు అందించలేని పరిస్థితుల్లో ఉంది. మరోవైపు శ్రీలంకలో ఇంధన సంక్షోభం ముదురుతోంది. దేశ వ్యాప్తంగా బంకుల్లో నోస్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. తాజాగా శ్రీలంక ఇంధన శాఖ, విద్యుత్ మంత్రి కాంచన విజేశేఖర కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ కు విదేశీ మారక నిల్వలు చెల్లించే పరిస్థితి కూడా లేదని విజేశేఖర వెల్లడించారు. తమ జలాల్లో రెండు నెలల పాటు లంగర్ వేసి ఉన్న […]
టీఆర్ఎస్ పార్టీ తరుపున రాజ్యసభ స్థానాలకు పేర్లను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. హెటిరో సంస్థ అధినేత డా.బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావులను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికచేశారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఒక రాజ్యసభ స్థానానికి రేపే ఆఖరు తేదీ ఉండటంతో ఈ రోజు అభ్యర్థులను ప్రకటించింది. డీ. […]
కేరళలో వానలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) బుధవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. గురువారం కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కేరళ చుట్టుపక్కల ప్రాంతాలలో […]
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు సమయంలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేఖించారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం నుంచి పెద్దగా రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు కిరణ్ కుమార్ రెడ్డి. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. త్వరలోనే ఆయన్ను ఏపీ పీసీసీ చీఫ్ గా […]
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి ఉపసంహరణను మరింత వేగం చేయాలని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు సమావేశం అయిన కేంద్ర క్యాబినెట్ మహారత్న,నవరత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలలో మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణతో పాటు మైనారిటీ భాగస్వామ్యాలను అమ్మాలని నిర్ణయం తీసుకుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా నిర్ణయ అధికారాన్ని ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లకు కట్టుబెడుతూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. […]