Gyanavapi masjid row: బయటపడిన శివలింగాన్ని మాకు అప్పగించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్టు మసీదు మొత్తాన్ని వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ నెల 14-16 వరకు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇదిలా ఉంటే మసీదులో ఉన్న బావితో శివలింగం బయటపడిందని తెలుస్తోంది. నిజానికి సర్వే రిపోర్టును ఈ నెల 17న వారణాసి కోర్టుకు అందించాలి… అయితే మసీదులోని వాజుఖానా బావిలో శివలింగ ఆకారం బయటపడటంతో సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రెండు రోజులు గడువు కావాలని కోరారు కోర్ట్ కమిషనర్లు. దీనికి వారణాసి కోర్ట్ అనుమతించింది.
మరోవైపు జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వీడియో సర్వేను ఆపేయాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీదు నిర్వహణ కమిటీ వేసిన పిటిషన్ ను మంగళవారం సుప్రీం కోర్ట్ విచారించింది. శివలింగం బయటపడిన ప్రాంతాన్ని రక్షించాల్సిందిగా వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ ను ఆదేశించింది. అదే విధంగా ముస్లింలు ప్రార్థన చేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఇదిల ఉంటే జ్ఞానవాపి మసీదులో బయటపడ్డ శివలింగాన్ని తమకు ఇవ్వాలని కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రొఫెసర్ నాగేంద్ర పాండే డిమాండ్ చేశారు. శివలింగం బయట పడితే అది ‘వజుఖానా’ ఎలా అవుతుందని ప్రశ్నించారు. శివలింగాన్ని కాశీ విశ్వనాథ్ న్యాస్ కు అప్పగిస్తే భగవంతుడికి సక్రమంగా పూజలు చేస్తామని పాండే అన్నారు.ఇదిలా ఉంటే… శివలింగం ఉన్నవజుఖానా పక్కనే ఉన్న గోడను కూల్చివేయాలని వారణాసి కోర్టులలో పిటిషన్ దాఖలైంది.
వారణాసి కాశీ విశ్వనాథ్ ఆలయంలోని భాగంగా ఉన్న జ్ఞానవాపి ఆలయాన్ని మొగల్ పాలకుల సమయంలో ఔరంగజేబు ధ్వంసం చేసి మసీదుగా మర్చారని చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి ఆధారం చేకూరుస్తూ… ఆలయంలోని వెనకభాగంలో హిందు ఆలయానికి సంబంధించిన స్తంబాలు, గోడ కనిపిస్తున్నాయని హిందూ సంఘాలు చెబుతున్నాయి. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ దేవతలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు కోర్ట్ లో పిటిషన్ వేయగా… వారణాసి కోర్ట్ వీడియో సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!