ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు తాలిబన్ రాజ్యం నడుస్తోంది. వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అక్కడ. మహిళలకు పెద్దగా హక్కులేం ఉండవు తాలిబన్ పాలనలో. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు తాలిబన్ పాలకులు. ఇప్పటికే మహిళలపై పలు రకాలుగా ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలను కేవలం వంటిళ్లకే పరిమితం చేశారు. బయటకు వస్తే ఖచ్చితంగా బుర్ఖా ధరించాలని హుకుం జారీ చేశారు. దీంతో పాటు భర్త, అన్న ఎవరైనా తోడు ఉంటేనే బయటకు రావాలనే ఆంక్షలను విధించారు. ఇదిలా […]
దేశంలో ఓవైపు జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. వారణాసి కోర్ట్ తో పాటు సుప్రీం కోర్ట్ లోొ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవల వారణాసి కోర్ట్ ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇందులో భాగంగా మసీదులోని ‘వాజు ఖానా’లో బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్ట్ బయటపడిన శివలింగానికి రక్షణ ఇవ్వాలని వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు […]
ఇండియాకు గుడ్ న్యూస్. రాబోయే కాలంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారుగా ఉన్న ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. దీంతో ఇండో నేషియా నుంచి ఇకపై వివిధ దేశాలకు పామాయిల్ ఎగుమతి కానుంది. ఈ విషయాన్ని ఇండోనేషియా జోకో విడొడో తెలిపారు. ఇండోనేషియాలో ఆయిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఎప్రిల్ 28న పాయాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది అక్కడి సర్కార్. పామాయిల్ వ్యాపారుల నుంచి వస్తున్న ఒత్తడితో అక్కడి […]
శ్రీలంకలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో గత కొన్ని నెలల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా గురువారం శ్రీలంకలో మరోసారి టెన్షన్ నెలకొంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థి సంఘాలు రాజధాని కొలంబోలోని అధ్యక్షుడు ఇంటి ముందు పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్నారు. గోటబయ వెంటనే రాజీనామా […]
తెలంగాణలోకి పెట్టుబడులు తెచ్చే విధంగా మంత్రి కేటీఆర్ యూకే పర్యటన సాగుతోంది. వివిధ కంపెనీల ప్రతినిధులను కలుస్తూ తెలంగాణ పెట్టుబడులకు అనువైన పరిస్థితులను గురించి వివరిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రెండో రోజు పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్ తుల్లీ మరియు సీనియర్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ లో కొనసాగుతున్న తమ కంపెనీ కార్యకలాపాల విస్తరణ పై చర్చించారు. పియర్సన్ కంపెనీ […]
దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మసీదులో కోర్ట్ నియమించిన కమిషనర్లు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఈ సర్వేను ఆపేయాలంటూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. సర్వేలో భాగంగా మసీదు ‘ వాజుఖానా’ లోని బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్, శివలింగం బయటపడిన […]
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామపంచాయతీల్లో 10 గ్రామాల్లో పది తెలంగాణకు చెందినవే అని టీఆర్ఎస్ పార్టీ ఛాతీలు కొట్టుకుంటున్నారని.. ప్లీనరీతో మొదలు పెడితే ఎక్కడ పడితే అక్కడ టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీ పనిచేసిన చోట ఒక్క అవార్డు కూడా రాలేదని… 10 పంచాయతీలు ఒక కాంగ్రెస్ ఎంపీ, ఇద్దరు బీజేపీ ఎంపీల పరిధిలోనే ఉన్నాయని అన్నారు. ఇది మీ టీఆర్ఎస్ పార్టీ నేతల పనితీరు, మీ […]
సర్పంచులను ఎక్కువగా అవమానిస్తుంది సీఎం కేసీఆర్ అని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీల నిధులు సర్పంచులకు సంబంధం లేకుండా ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కేంద్ర నిధులు లోకల్ బాడీలకు రావద్దని చెప్పడాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు ఖండించాలని పిలుపు ఇచ్చారు. కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులను పద్దతి లేకుండా సీఎం కేసీఆర్ వినియోగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఖజానా లూటీ చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం […]
టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన భార్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న భాగ్యలక్ష్మీ కూడా టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రియాంక గాంధీ సమక్షంలో వీరిద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లాల ఓదెలును కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ […]
తెలంగాణ నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పబోతోంది ప్రభుత్వం. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు అన్ని శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రూప్ 4 కేడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని… దీనికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నట్లు సోమేష్ కుమార్ వెల్లడించారు. ఇప్పటికే టీఎస్పీఎస్పీ గ్రూప్ […]