రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఎంత హెచ్చరించినా… నార్డిక్ దేశాలు స్వీడన్, ఫిన్లాండ్ నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్( నాటో) చేరడానికే మొగ్గు చూపాయి. తాజాగా బుధవారం నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్ బర్గ్ ధ్రువీకరించారు. నాటోలో చేరితే మాస్కో నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని రష్యా హెచ్చరించానా ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గలేదు. ఇదిలా ఉంటే స్వీడన్, ఫిన్లాండ్ […]
శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక తమ ప్రజలకు నిత్యావసరాలు అందించలేని పరిస్థితుల్లో ఉంది. మరోవైపు శ్రీలంకలో ఇంధన సంక్షోభం ముదురుతోంది. దేశ వ్యాప్తంగా బంకుల్లో నోస్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. తాజాగా శ్రీలంక ఇంధన శాఖ, విద్యుత్ మంత్రి కాంచన విజేశేఖర కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ కు విదేశీ మారక నిల్వలు చెల్లించే పరిస్థితి కూడా లేదని విజేశేఖర వెల్లడించారు. తమ జలాల్లో రెండు నెలల పాటు లంగర్ వేసి ఉన్న […]
టీఆర్ఎస్ పార్టీ తరుపున రాజ్యసభ స్థానాలకు పేర్లను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. హెటిరో సంస్థ అధినేత డా.బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్ రావులను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికచేశారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఒక రాజ్యసభ స్థానానికి రేపే ఆఖరు తేదీ ఉండటంతో ఈ రోజు అభ్యర్థులను ప్రకటించింది. డీ. […]
కేరళలో వానలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) బుధవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. గురువారం కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కేరళ చుట్టుపక్కల ప్రాంతాలలో […]
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు సమయంలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేఖించారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం నుంచి పెద్దగా రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు కిరణ్ కుమార్ రెడ్డి. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. త్వరలోనే ఆయన్ను ఏపీ పీసీసీ చీఫ్ గా […]
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి ఉపసంహరణను మరింత వేగం చేయాలని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు సమావేశం అయిన కేంద్ర క్యాబినెట్ మహారత్న,నవరత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలలో మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణతో పాటు మైనారిటీ భాగస్వామ్యాలను అమ్మాలని నిర్ణయం తీసుకుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా నిర్ణయ అధికారాన్ని ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లకు కట్టుబెడుతూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. […]
గుజరాత్ లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్బీలోని ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది కూలీలు దుర్మరణం చెందారు. హల్వాద్ జీఐడీసీ సాగర్ సాల్ట్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ సంఘటనలో 12 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. బస్తాల్లో ఉప్పు నింపే పనులు జరుగుతుండగా.. ఉన్నట్టుండి ఫ్యాక్టరీ ప్రహారీ గోడ కూలింది. కాగా.. మరణించిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. గోడ కింద మరింత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 20 మంది […]
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గురించి పరిచయం అక్కర లేదు. తెలంగాణ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. సోనియాగాంధీ కుటుంబానికి వీరవిధేయుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై విమర్శలు గుప్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వం చేసే మంచి పనులను పొగుడుతూ ఉంటారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలను బహిరంగంగానే పొగిడారు. ఇదిలా ఉంటే మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. […]
కీలకమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. సెమస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో మెరుపులు మెరిపించారు. ముంబై ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు సన్ రైజర్స్ బ్యాటర్లు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు సాధించారు. ఫలితంగా ముంబై ముందు 194 పరుగుల భారీ టార్గెట్ పెట్టారు. సన్ రైజర్స్ బ్యాటర్లలో ప్రియంగార్గ్, త్రిపాఠి, నికోలస్ […]
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తాజాగా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంఛార్జీల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయిందని.. ప్రజా సంగ్రామ యాత్రపై దేశం మొత్తం చర్చ జరగిందని ఆయన అన్నారు. అధికారంలోకి బీజేపీ రాబోతోందని సంకేతాలు వెలువడ్డాయని ఆయన అన్నారు. ప్రధాని మోదీని త్వరలో రాష్ట్రానికి ఆహ్వనించే ప్రయత్నం చేస్తున్నామని […]