దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాధి దాదాపుగా తగ్గుముఖం పట్టింది. కేవలం మూడు వేలకు లోపే కేసులు నమోదు అవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ లో కరోనా ప్రభావం దేశంపై తక్కవనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచడం కూడా వ్యాధి వ్యాప్తి, మరణాల రేటు తగ్గించడానికి సహాయ పడ్డాయి. ప్రస్తుతం దేశంలో కేవలం 15044 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా […]
పోలీస్ ఉద్యోగాలే టార్గెట్ గా కష్టపడుతున్న వారికి, తమకు వయో పరిమితి దాటిందని బాధపడుతున్ననిరుద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇటీవల తెలంగాణ సర్కార్ 17,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు తగ్గట్లుగానే లక్షల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే కోవిడ్ వల్ల, నోటిఫికేషన్ ఆలస్యం […]
ప్రపంచం ఓ వైపు కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతోంది. చైనా వూహాన్ లో మొదలైన కోవిడ్ వ్యాధి నెమ్మదిగా ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. దీంతో పలు దేశాల ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు కరోనా తన రూపాలను మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మంకీపాక్స్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. పాశ్చాత్య దేశాల్లో ఈ కేసుల సంఖ్య క్రమంగా […]
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సెటైర్లు పేల్చారు. సీఎం కేసీఆర్ కూట్లో రాయి తీయలేడు కానీ.. ఏట్లో రాయి తీస్తానని ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని… ఉద్యోగాలకు జీతాలు లేవని… మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే…గతి లేక […]
కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 31 సంవత్సరాలకు పెంచాలని అడిగానని… సీఎం కేసీఆర్ 32 ఏళ్లకు పెంచారని… నేను డిమాండ్ చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ స్పందించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మీరు ఉద్యోగాలు ఇస్తోంది వేలల్లో ఉన్నాయని… మిగితా నిరుద్యోగుల పరిస్థితి ఏంటని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు కేఏ పాల్. గత ఎనిమిదేళ్ల నుంచి మీకు చెబుతున్నా… వేడుకున్నా ప్రజాసమస్యలపై కేసీఆర్ స్పందించడం లేదని అన్నారు. ప్రజాశాంతి పార్టీ బడుగు, […]
తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో ఏర్పడిన ప్రభుత్వ ఖజానాను సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు సాయంగా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. మరి తెలంగాణ రైతులను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా…? అని సెటైర్లు వేశారు. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో స్థానం సంపాదించుకోవాలనే స్వార్థంతోనే ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. ఢిల్లీలో పంజాబ్ రైతులు నిరసన తెలిపినప్పుడు ఒక్క రోజు కూడా సీఎం కేసీఆర్ సంఘీభావం […]
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2022 జూన్ 2 నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతుంది. మరి కొన్ని రోజుల్లో తెలంగాణ అవతరణ రోజు రాబోతుండటంతో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. దీంట్లో భాగంగా సీఎస్ సోమేష్ కుమార్ రాష్ట్ర అవతరణ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన ఉదయం […]
సుప్రీంకోర్ట్ లో జ్ఞానవాపీ విచారణ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా జ్ఞానవాపీ మసీదు వ్యవహారం మారింది. రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కావడంతో సుప్రీం కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే సుప్రీం కోర్ట్ ఈ వ్యవహారాన్ని వారణాసిజిల్లా కోర్ట్ లోనే విచారించాలనే నిర్ణయంపై మొగ్గు చూపింది. జిల్లా జడ్జీ ఈ విచారణను చేపడితే బాగుంటుందని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. సీనియర్, అనుభవం ఉన్న జడ్జీ ఈ కేసును విచారిస్తారని సుప్రీం కోర్ట్ […]
సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. గతంలో రైతు ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన విధంగా రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు నష్ట పరిహారం అందించనున్నారు. ఇదే విధంగా దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతో చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం ఢిల్లీలో ఆర్థికవేత్తలు, జర్నలిస్టులతోె కేసీఆర్ సమావేశం కానున్నారు. మే 21న చంఢీగడ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి […]
దేశవ్యాప్తంగా సంచలన రేపిన దిశ ఎన్ కౌంటర్ కేసులో పోలీసులు కట్టుకథలు చెప్పారని.. ఎన్ కౌంటర్ బూటకం అని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. చట్టపరమైన నిబంధనలను, పోలీస్ మాన్యువల్ రూల్స్ ను అతిక్రమించారని తెలిపింది కమిషన్. మీడియాకు విచారణ కమిషన్ కు పోలీసులు కట్టుకథలు చెప్పారని కమిషన్ తెలిపింది. ఎన్ కౌంటర్ స్థలంలో సీసీ కెమెరా పుటేజ్ దొరక్కుండా చేసిందని రిపోర్ట్ ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్. దిశ నిందుతులే పోలీసులపై కాల్పులు జరిపారనేది అబద్ధం అని […]