F-35B Fighter Jet: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అత్యంత అడ్వాన్సుడ్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఎఫ్-35బీ ఫైటర్ జెట్, సాంకేతికత కారణాలతో కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో దిగింది. అయితే, అప్పటి నుంచి దీని సాంకేతిక సమస్యలు దూరం కాలేదు. దీంతో గత మూడు వారాలుగా ఎయిర్‌పోర్టులోనే ఉంది. చివరకు 24 మంది నిపుణులు దీనిని రిపేర్ చేయడానికి భారత్ రావాల్సి వచ్చింది. మరమ్మతుల కోసం ఎయిర్‌పోర్టులోని హ్యాంగర్‌కి తరలించారు.
Read Also: Vikarabad: చిన్న పిల్లాడివి.. మద్యం తాగొద్దని చెప్పినందుకు కొడవలితో దాడి..
అయితే, ఇప్పుడు ఈ ఎఫ్-35 ఫైటర్ జెట్‌పై మీమ్స్ పేలుతున్నాయి. మీమర్లు దీనిని ఒక ఫన్ వస్తువుగా మార్చారు. బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన ఈ ఎఫ్-35బీకి ఏకంగా ‘‘పాన్ కార్డ్’’, ‘‘ఆధార్ కార్డ్’’ కూడా వచ్చినట్లు మీమ్స్ పట్టుకొస్తున్నాయి. చివరకు దీని పేరును ‘‘ఎఫ్-35బీ నాయర్’’గా పేరు మార్చారు. ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టినట్లు మీమ్స్ వస్తున్నాయి. చివరకు కేరళ పర్యాటక శాఖ కూడా దీనిని వాడుకుంది. ‘‘ఎఫ్-35కు కూడా కేరళ వదిలి వెళ్లేందుకు ఇష్టపడటం లేదని, అద్భుత ప్రదేశంగా ఫైవ్-స్టార్ రేటింగ్ ఇచ్చినట్లు ప్రచారం చేస్తుకుంటోంది.’’ ఇదే కాకుండా, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక ఎఫ్-35కి కూడా ఇన్సూరెన్స్ చేస్తారని, ఎఫ్-35 బ్రో కళ్లు, బనానా చిప్స్‌తో కేరళలో ఎంజాయ్ చేస్తున్నాడు అని మీమ్స్ వస్తున్నాయి.
Kaymas Biriyani
Has takenF35 meme to a next level😂 pic.twitter.com/Fw8FH1whGG
— Dr MJ Augustine Vinod 🇮🇳 (@mjavinod) July 5, 2025
F-35B Nair got its PAN card. Now it’s time to link it with Aadhaar as per Govt. rules. https://t.co/JgtMDLCajS pic.twitter.com/Owr4aWbkQf
— Pranjal Pandey (@Me_ppranjal) July 3, 2025
Game over in the F-35 meme wars. pic.twitter.com/MfWYZVVfsg
— Shiv Aroor (@ShivAroor) July 3, 2025
Maybe I am late to the Meme fest of #F35B . 🫣🫣🫣🫣 pic.twitter.com/sHHskwRnnM
— Arindam Mahapatra (@Maha7Arindam) July 4, 2025
Kerala, the destination you'll never want to leave.
Thank you, The Fauxy.#F35 #Trivandrum #KeralaTourism pic.twitter.com/3lei66a5T2
— Kerala Tourism (@KeralaTourism) July 2, 2025