Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
- ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మారా ఫ్లావియా అరౌజో
- అమెరికాలో జరిగిన ఈత పోటీలో పాల్గొని మరణించారు
- ఫ్లావియా ఒక అనుభవజ్ఞురాలైన ఐరన్‌మ్యాన్ అథ్లెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రఖ్యాత బ్రెజిలియన్ క్రీడాకారిణి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన మారా ఫ్లావియా అరౌజో అమెరికాలో జరిగిన ఈత పోటీలో పాల్గొని మరణించారు. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో, లేక్ వుడ్‌ల్యాండ్స్‌లో జరిగిన 2.4 మైళ్ల ఓపెన్ వాటర్ స్విమ్ పోటీలో ఆమె నీటిలో మునిగిపోయి, తిరిగి పైకి రాలేదు. “అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆమె కుటుంబం ఒడ్డున కూర్చుని, యాప్‌ను రిఫ్రెష్ చేస్తూ ఆమెను చూస్తున్నారు, కానీ ఆమె ఉన్న ప్రదేశం ఎప్పుడూ అప్‌డేట్ అవ్వలేదు. ఆమె అస్సలు బయటకు రాలేదు,” అని ఈవెంట్ వాలంటీర్ సీన్ మెక్‌డొనాల్డ్ తెలిపారు.
ఫ్లావియా ఒక అనుభవజ్ఞురాలైన ఐరన్‌మ్యాన్ అథ్లెట్. ఆమె 2018 నుండి కనీసం తొమ్మిది ఐరన్‌మ్యాన్ రేసులను పూర్తి చేసింది. ఇటీవల బ్రెసిలియా ట్రయాథ్లాన్‌లో మూడవ స్థానంలో నిలిచింది. ఆమెకు సోషల్ మీడియాలో 60,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. గతంలో జర్నలిస్ట్‌గా, రేడియో ప్రజెంటర్‌గా పనిచేశారు. సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం, ఆమె ఈత పట్ల తన అభిరుచిని కనుగొన్నారు .
Also Read
రేసుకు కొన్ని రోజుల ముందు నుంచి ఫ్లావియా నీరసంగా ఉందని అనారోగ్యానికి గురైనట్లు ఆమె స్నేహితుడు లూయిస్ టవేరియా చెప్పాడు. వద్దని వారించినా ఆమె పోటీలో పాల్గొన్నదని తెలిపాడు. పోటీ సమయంలో ఫ్లావియా గురించి తెలియగానే, సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. వుడ్‌ల్యాండ్స్ టౌన్‌షిప్ అగ్నిమాపక శాఖకు చెందిన డైవ్ యూనిట్, ఏమీ కనిపించని నీటిలో గాలింపు చేపట్టింది.
ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నార్త్‌షోర్ పార్క్ సమీపంలో 10 అడుగుల నీటిలో మృతదేహం లభ్యమైంది. నీటిలో మునిగిపోవడం వల్లే మరణం సంభవించినట్లు నిర్ధారించారు. మాంట్‌గోమరీ కౌంటీ పోలీసులు సాధారణ దర్యాప్తును ప్రారంభించారు.
ఐరన్‌మ్యాన్ టెక్సాస్ ఫేస్‌బుక్‌లో తమ సంతాపం వ్యక్తం చేస్తూ, “ఆ అథ్లెట్ కుటుంబానికి, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ కష్ట సమయంలో మేము వారికి పూర్తి అండగా ఉంటాము” అని పేర్కొంది. ఫ్లావియా తన శిక్షణకు సంబంధించిన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను పెట్టగా, దానికి ఇప్పుడు వేలాది స్పందనలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!