Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Varma Dating: బాలీవుడ్ వెర్సటైల్ నటుడు విజయ్ వర్మ మరోసారి తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో లవ్ బ్రేకప్ అయిన తర్వాత, విజయ్ వర్మ మళ్లీ ప్రేమలో పడ్డారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ఆయన ఒక యువ నటితో కలిసి ముంబై వీధుల్లో కనిపించడమే ఇందుకు కారణం. ఏప్రిల్ 21వ తేదీ రాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో విజయ్ వర్మ ఒక అమ్మాయితో కలిసి కెమెరా కంటికి చిక్కారు. వారిద్దరూ ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో డిన్నర్ ముగించుకుని బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి మరెవరో కాదు, ‘జవాన్’ ఫేమ్ ఆలియా ఖురేషి. వీరిద్దరి చనువు చూస్తుంటే వారు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే వారు కేవలం మంచి స్నేహితులు మాత్రమేనా లేక అంతకుమించి ఏదైనా ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఎవరీ ఆలియా ఖురేషి..
విజయ్ వర్మతో కనిపించిన తర్వాత నెటిజన్లు ఆలియా ఖురేషి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. ముంబైకి చెందిన ఆలియా, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆలియా కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక గొప్ప గాయని, పాటల రచయిత్రి కూడా. ఐదో తరగతిలోనే తన మొదటి పాటను రాసిన ఆమె, “ఝల్లీ” వంటి పాపులర్ సాంగ్స్‌ను స్వరపరిచారు. 2022లో నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘ఎటర్నల్లీ కన్ఫ్యూజ్డ్ అండ్ ఈగర్ ఫర్ లవ్’తో నటనలోకి అడుగుపెట్టారు ఈ బ్యూటీ.
Also Read
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
- Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
- Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
‘జవాన్’తో గుర్తింపు
షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ ‘జవాన్’ ఆలియాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ గర్ల్ గ్యాంగ్‌లో ఒకరైన ‘జాన్వి’ పాత్రలో ఆమె మెరిశారు. ఈ సినిమాతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. ఆలియా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఝాలివర్స్’ పేరుతో ఆమెకు 1.38 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. విజయ్ వర్మతో డిన్నర్ డేట్ తర్వాత ఆమె ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. విజయ్ వర్మ – తమన్నా గతంలో ఓపెన్‌గానే తమ రిలేషన్‌షిప్ బ్రేకప్ అయ్యిందని అంగీకరించారు. ఇప్పుడు విజయ్ వర్మ ఆలియాతో కనిపిస్తుండటంతో తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!