Pinaka-IV: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటింది. భారత స్వదేశీ తయారీ ఆయుధాలైన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ ముందు, పాకిస్తాన్ డ్రోన్లు, చైనా తయారీ మిస్సైళ్లు తట్టుకోలేకపోయాయి. స్కై స్ట్రైకర్ డ్రోన్లు పాకిస్తాన్ దాడుల్ని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. భారత్ కొట్టిన దెబ్బ ఇటు పాకిస్తాన్‌కు అటు చైనాకు మింగుడుపడటం లేదు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు భారత్ ఈ రెండు దేశాలకు మరో బ్యాడ్ న్యూస్ తీసుకువచ్చింది. భారత్ శత్రుదేశాల వైమానికి రక్షణ వ్యవస్థల నుంచి కూడా తప్పించుకునే సత్తా కలిగిన క్షిపణిని డెవలప్ చేస్తోంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పినాకా-4 అనే నెక్ట్స్ జనరేషన్ గైడెడ్ రాకెట్ వ్యవస్థపై పనిచేస్తోంది. ఈ కొత్త రాకెట్ వ్యవస్థ 300 కి.మీ దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించేలా రూపొందిస్తున్నారు.
Read Also: Saipallavi : సాయిపల్లవి సీత పాత్రకు సరిపోదంట.. నార్త్ మీడియా అక్కసు..
ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ (IDRW) నివేదిక ప్రకారం, ఈ శక్తివంతమైన, అధునాతన రాకెట్ వ్యవస్థ పరీక్ష 2028లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పినాకా-4 ప్రళయ్ వంటి వ్యూహాత్మక క్షిపణుల నుంచి ప్రేరణ పొందుతుంది. శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నుంచి తప్పించుకోవడానికి, అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయడానికి కావాల్సిన స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉంటాయి.
పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధం తర్వాత, భారత సైన్యం ఈ రాకెట్ వ్యవస్థను భారత్ డెవలప్ చేసింది. పాత వెర్షన్ పినాకా మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్ (MBRL)ను భారత దళాలు ఉపయోగిస్తున్నాయి. అప్పటి నుంచి పినాకా భారత ఆర్టిలరీ వ్యవస్థలో కీలక భాగంగా మారింది. భారతీయ పురాణాల్లో శివుడి విల్లు అయిన పినాకా పేరును ఈ వ్యవస్థకు పెట్టారు.
పినాకా వ్యవస్థ ఇప్పుడు 300 కి.మీ పరిధిలోని లక్ష్యాలపై దాడులు చేయడానికి అప్‌గ్రేడ్ చేస్తు్న్నారు. మొదటి వెర్షన్ పినాకా Mk-I, 40 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. తరువాత, 75–90 కిలోమీటర్ల వరకు ఎక్కువ పరిధితో కొత్త వెర్షన్‌లను అభివృద్ధి చేశారు. రాబోయే పినాకా Mk-III 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించగలదు. ఇప్పుడు, DRDO పినాకా-IVపై పని చేస్తోంది. ఈ క్షిపణి 250 కిలోల బరువైన పేలుడు పదార్థాలు మోసుకెళ్లగలదు.