Russia: ప్రపంచంలో పలు దేశాలు భారతీయ కార్మికులు, ఉద్యోగులపై ఆధారపడుతున్నాయి. యూఏఈ, ఖతార్, ఇజ్రాయిల్ వంటి దేశాలు భారతీయ కార్మికులను నియమించుకుంటున్నాయి. అక్కడి భవన నిర్మాణ రంగాల్లో, వస్త్ర పరిశ్రమ, వ్యవసాయం, ఇతర పరిశ్రమల్లో భారతీయులను రిక్రూట్ చేసుకుంటున్నారు. యూకే, అమెరికా వంటి దేశాలు భారతీయ వృత్తి నిపుణులను ఆహ్వానిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఇప్పుడు రష్యా కూడా భారతీయులను సాదరంగా స్వాగతిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధ కారణంగా రష్యాలో కార్మికుల కొరత ఏర్పడింది. దీనిని భర్తీ చేసేందుకు భారతీయ కార్మికులను కోరకుంటున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నా్యి. భారతదేశం నుంచి 2025 చివరి నాటికి 10 లక్షల మంది రష్యాకు వస్తారని, రష్యాలోని ఎకటేరియన్ బర్గ్‌లో కొత్తగా భారత కాన్సులేట్ తెరుస్తారని ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధిపతి ఆండ్రీ బెసెడిన్ చెప్పారు. దీనిపై ఇప్పటికే ఒప్పందాలు కుదిరినట్లు వెల్లడించారు.
Read Also: Extra Marital Affair: మరో భర్త బలి.. ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు దారుణంగా..
అయితే, ఈ వార్తల్ని రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. భారతదేశం నుంచి కార్మికుల నియామకం యజమానుల అవసరాల ఆధారంగా ఒక ఏడాది ముందుగానే కోటా ద్వారా నిర్ణయించబడుతుందని చెప్పింది. కోటా పరిధిలోకి వచ్చే వీసా దేశాల నుంచి వచ్చిన వారికి వర్క్ వీసా, వర్క్ పర్మిట్ పొందుతారని చెప్పింది. అంతేకాకుండా కంపెనీ కార్మికుడిని నియమించే ముందు అంతర్గత మంత్రిత్వ శాఖ అనుమతి పొందాలని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
2025లో రష్యా విదేశీ కార్మికుల కోటా 2,34,900గా ఉంది, ఇందులో 71,817 మంది భారతీయులు ఉన్నారు. గతేడాది యింట్ పీటర్స్‌బర్గ్‌లోనే 4,000 మందికి పైగా భారతీయ వలసదారులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాలినన్ గ్రాడ్, మాస్కోలోని పలు ప్రాంతాల్లో భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు.