కాళి అమ్మవారిని సిగరేట్ తాగుతూ చూపించడాన్ని హిందు సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో టోరంటోలోని అగాఖాన్ మ్యాజియం హిందువుల మత విశ్వాసాలను కించపరిచేందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఒట్టావాలోని భారత మిషన్, కెనడాలోని అధికారులు వివాదస్పద చిత్రాన్ని తొలిగించాలని కోరడంతో ‘ కాళి’ డాక్యుమెంటరీ ప్రదర్శనను తీసివేసినట్లు తెలిపింది.
టొరంటోకు చెందిన చిత్రనిర్మాత మణిమేకలై శనివారం ‘ కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ ను ట్విట్టర్ లో పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇందులో కాళి అవతారంలో ఉన్న మహిళ సిగరేట్ తాగుతూ.. చేతిటో ఎల్జీబీటీక్యూ జెండను పట్టుకుంది. దీంతో ఒక్కసారి పలు హిందూ సంఘాలు, హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ అరెస్ట్ లీనా మణిమేకలై’ అంటూ ట్విట్టర్ లో హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల కేసులు కూడా నమోదు అయ్యాయి.
భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కెనడా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. దీంతో ఈ వివాదంపై మ్యూజియం తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది. టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ విభిన్న జాతులు, సాంస్కృతిక నేపథ్యాల విద్యార్థుల రచనలను ఒక చోట చేర్చడానికి ‘అండర్ ది టెన్త్’ ప్రాజెక్ట్ లో భాగంగా పలు డాక్యుమెంటరీలను ప్రదర్శించింది. ఇందులో భాగంగానే కాళి డాక్యుమెంటరీని తీశారు. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది.
తమిళనాడు మదురైలో జన్మించిన డాక్యుమెంటరీ నిర్మాత మణిమేకలై ఈ వివాదంపై స్పందించింది. తాను జీవించి ఉన్నంత కాలంల నిర్భయంగా తన అభిప్రాయాలను చెబుతానని అంది. నేను కోల్పోయేది ఏదీ లేదని.. జీవించి ఉన్నంత కాలం నమ్మినదాని కోసం నిర్భయంగా మాట్లాడుతానని.. అందుకు మూల్యం నా ప్రాణమే అయితే అది కూడా ఇస్తానని ట్విట్టర్ లో స్పందించింది. ఈ సినిమా చూస్తే ‘అరెస్ట్ లీనా మణిమేకలై’ అని కాకుండా ‘లవ్ యు లీనా మణిమేకలై’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను పెడతారని ఆమె సమాధానం ఇచ్చింది.