పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. గురువారం చంఢీగర్లోని సీఎం నివాసంలో డాక్టర్ గుర్ ప్రీత్ కౌర్ ను వివాహం చేసున్నాడు మాన్. హర్యాన కురుక్షేత్రకు చెందిన గుర్ ప్రీత్ కౌర్, సీఎం భార్య కావడంతో ఒక్కసారిగా నెటిజెన్లు ఈమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. డాక్టర్ అయిన గుర్ ప్రీత్ కౌర్, గత ఎన్నికల్లో భగవంత్ మాన్ కు సహకరించిందని తెలుస్తోంది. భగవంత్ మాన్ కుటుంబానికి, గుర్ ప్రతీ కౌర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో మాన్ తల్లి, సోదరి ఇద్దరు ఈ సంబంధాన్ని ఓకే చేశారు.

భగవంత్ మాన్ కు అంతకుముందే ఇంద్రప్రీత్ కౌర్ తో వివాహం జరిగింది. అయితే ఆరేళ్ల క్రితం వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఇంద్రప్రీత్ కౌర్ తన ఇద్దరు పిల్లలతో కలిసి యూఎస్ఏలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ భారీ విజయం సాధించింది. దీంతో భగవంత్ మాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. మార్చి 16న జరిగిన మాన్ ప్రమాణ స్వీకారానికి మాజీ భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా పంజాబ్ వచ్చారు.
Read Also: Kamareddy Crime: దారుణం.. భర్తను గొంతు నులిమి హత్య చేసిన భార్య..
ఇదిలా ఉంటే పెళ్లయిన మరుసటి రోజే పంజాబ్ సీఎం భార్య గుర్ ప్రీత్ కౌర్ ట్విట్టర్ బ్లాక్ అయింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు కాబోయే రెండో భార్య కావడంతో దేశవ్యాప్తంగా నెటిజెన్లు ఒక్కసారిగా గురు ప్రీత్ కౌర్ ను ట్విట్టర్ లో ఫాలో కావడం ప్రారంభించారు. దీనికి తగ్గట్లుగానే గుర్ ప్రీత్ కౌర్ మెహందీ, పెళ్లికి సంబంధించి ఫోటోలు ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ గా మారాయి. దీంతో గురుప్రీత్ కౌర్ ను ఫాలో చేసే వారి సంఖ్య ఎక్కువ అయింది. ట్విట్టర్ నిబంధనలు ఉల్లంఘించినందుకే గుర్ ప్రీత్ కౌర్ ట్విట్టర్ ఖాతా బ్లాక్ అయినట్లు తెలుస్తోంది. దీనికి ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పెరగడమే కారణం అని తెలుస్తోంది.