బాధ్యతాయుతంగా ఉండీ సమాజానికి మంచి విలువలు అందించాల్సిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) అధికారి పాడుపనికి పాల్పడ్డాడు. ఐఐటీ ట్రైనీ స్టూడెంట్ ను లైంగికంగా వేధించాడు. దీంతో ఘటనపై జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్ అయింది. సదరు ఐఏఎస్ అధికారి సయ్యద్ రియాజ్ అహ్మద్ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. కుంతి సబ్ డిజిజనల్ మెజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా విధులు నిర్వహిస్తున్న అహ్మద్ ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. తాజాగా సీఎం హేమంత్ సోరెన్ ఆదేశాలతో ఉన్నతాధికారులు అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. కోర్టు రెండు వారాల జ్యుడిషిల్ కస్టడీ విధించింది.
ఐఏఎస్ అధికారి అహ్మద్ పై ఐపీసీ సెక్షన్ 354( మహిళలపై దాడి, నేరపూరితంగా బలవంత చేయడం), 354ఏ( లైంగిక వేధింపులు), 509 ( మహిళల గౌరవాన్ని కించపరచడం) కింద కేసులు నమోదు అయ్యాయి. జూలై 5న న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
Read Also: Liger: బాలీవుడ్ బ్యూటీ తో విజయ్ దేవరకొండ ఊర మాస్ డాన్స్..
ఇటీవల ఇతర రాష్ట్రానికి చెందిన ఐఐటీ విద్యార్థులు ఎనిమిది మంది శిక్షణ కోసం జార్ఖండ్ వచ్చారు. ఈ క్రమంలోనే వారికి డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. పార్టీలో విద్యార్థిని ఒంటరిగా ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారి సయ్యద్ రియాజ్ అహ్మద్ లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్టీకి హాజరైన వారిలో కొంతమందిని విచారించిన అధికారులు ప్రాథమికంగా ఆరోపణలు నిజమే అని గుర్తించారు. ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేశారు.