రెండు రోజులుగా ఇండిగో ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్లు మూమకుమ్మడి సిక్ లీవులు పెట్టినట్లు తెలుస్తోంది. తమకు ఇస్తున్న తక్కువ జీతాలకు వ్యతిరేకంగా హైదరాబాద్, ఢిల్లీల్లో సిక్ లీవుల్లో వెళ్లారని తెలుస్తోంది. గతంలో జూలై 2న ఇండిగో క్యాబిన్ సిబ్బంది ఒకే సారి సిక్ లీవులు తీసుకున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది. క్యాబిన్ సిబ్బంది సిక్ లీవుల్లో వెల్లడంతో దేశీయంగా 55 శాతం ఆలస్యం అయ్యాయి. అయితే వీరంతా ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ కు వెళ్లినట్లు ఎయిర్ లైన్స్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తాజాగా టెక్నీషియన్లు రెండు రోజుల పాటు సిక్ లీవులు తీసుకున్నారు. ఎటువంటి క్రమశిక్షణ చర్యలకు గురికాకుండా సిక్ లీవుల్లో వెళ్లినట్లు తెలుస్తోంది.
Read Also: CM KCR Today Speech: బీజేపీని చీల్చిచెండాడిన సీఎం కేసీఆర్
కోవిడ్ 19 మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఇండిగో తమ ఉద్యోగుల్లో చాలా మంది ఉద్యోగులు జీతాలను తగ్గించింది. అప్పటి నుంచి ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీనికి తోడు కొత్తగా రాకేష్ జున్ జున్ వాలా ‘ ఆకాశ ఎయిర్ లైన్స్’, టాటా గ్రూపుకు చెందిన ‘ఎయిర్ ఇండియా’, ‘జెట్ ఎయిర్ వేస్’ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఇండిగో ఉద్యోగులు పక్క చూపులు చూస్తున్నారు. ఈ మూడు సంస్థలు నిర్వహించే రిక్రూట్మెంట్లకు ఇండిగో సిబ్బంది హాజరవుతున్నట్లు తెలుస్తోంది.