హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వ్యక్తిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడిగా వేషం ధరించి నుక్కుడ్ నాటకంలో నటించిన వ్యక్తిపై నాగోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదంలో ప్రమేయం ఉన్న మరో ఇద్దరిని కూడా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన తర్వాత సదరు వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదంపై సీఎం హిమంతబిశ్వ శర్మ కూడా స్పందించారు. దుస్తులు ధరించడం నేరం కాదని.. అలాంటి సమయంలో అభ్యంతరకమైన విషయాలను చెబితే నేరంగా పరిగణిస్తామంటూ.. నాగావ్ పోలీసులకు ఈ ఘటనపై తగిన ఆదేశాలు ఇచ్చామని ఆయన ట్వీట్ చేశారు.
అసోంలోని నాగోన్ లని నుక్కడ్ నాటకంలో శివుడి పాత్రను ధరించిన వ్యక్తిపై మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ విషయంపై బీజేపీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనల కోసం దేవతల వేషధారణ ధరించడాన్ని సమర్థించమని బీజేపీ స్పష్టం చేసింది. మీరు నిరసన తెలియజేయాలంటే ఇబ్బంది లేదని కానీ.. ఇలా శివుడు, పార్వతి వేషాలు వేసుకుని నిరసన తెలపడాన్ని సమర్థించమని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read also: Suchendra Prasad: పవిత్రా లోకేష్ పై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు..
ధరల పెరుగుదలపై శివుడి వేషంలో నిరసన తెలిపినందుకు బోరించి బోరా అరెస్ట్ అయ్యాడు. ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ ఓ వీధి నాటకంలో శివుడి పాత్రను ధరించాడు. అయితే ఆ నాటకంలో ధరల పెంపు ప్రధాన అంశంగా ఉండగా..అని వేషధారణ మాత్రం హిందుబుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండటంతో కేసు నమోదు అయింది.