దేశీయ కార్ల దిగ్గజం టాటా మరోసారి తన సత్తాను చూపింది. దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కార్లలో టాటా నెక్సాన్ మరోసారి టాప్ ప్లేస్ లో నిలిచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్ అమ్మకాల్లో జూన్ నెలలో ఎక్కువగా అమ్ముడైన కార్లలో టాటా నెక్సాన్ మొదటిస్థానంలో ఉంది. 5 స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్, ఫీచర్స్, సేప్టీ, శక్తివంతమైన ఇంజిన్, ధర కూడా అందుబాటులో ఉండటంతో చాలా మంది ఈ కార్ ను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.
తాజాగా జూన్ నెలలో హైయెస్ట్ కార్ సెల్లింగ్స్ లో నెక్సాన్ టాప్ లో ఉంది. అంతకు ముందు నెలలో కూడా మొదటిస్థానంలోనే కొనసాగింది. ప్రస్తుతం టాటా నెక్సాన్ టాప్ 5 సెల్లింగ్ కార్లలో ఒకటిగా ఉంది. టాప్ 5 జాబితాలో హ్యుందాయ్ క్రేటాతో పాటు వెన్యూ కార్లు ఉన్నాయి. జూన్ నెలలో ఇండియా వ్యాప్తంగా 14,295 నెక్సాన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా అన్ని కార్లు కలుపుకుని చూస్తే నాలుగో స్థానంలో నిలిచింది నెక్సాన్. గతేడాది ఇదే నెలలో 8,033 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. నెక్సాన్ కార్ల అమ్మకాల గ్రోత్ 78 శాతం పెరిగింది. దీని తరువాతి స్థానంలో హ్యుందాయ్ క్రేటా ఉంది. హ్యుందాయ్ క్రేటా జూన్ నెలలో మొత్తం 13,790 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి 39 శాతం వృద్ధిని నమోదు చేసింది.
Read Also: Krithi Shetty: బేబమ్మ వెనకాల పడుతున్న స్టార్ హీరో.. వద్దన్నా వినలేదట..?
ఇదిలా ఉంటే కొత్తగా మారుతీ సుజుకీ నుంచి బ్రేజ్జా 2022 రావడంతో ప్రస్తుతం ఉన్న స్థానాల్లో మార్పులు రావచ్చని ఆటో ఎక్స్ పర్ట్ భావిస్తున్నారు. భద్రతతో 4 స్టార్ రేటింగ్ సాధించడంతో పాటు సన్ రూఫ్ తో పాటు ఇతర ఫీచర్లతో వస్తుండటంతో వచ్చే నెలల్లో ఈ కార్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్ లో టాటా పంచ్, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.