ప్రతీ ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటాం. భూమిపై పెరుగుతున్న జనాభా అవసరాలు, జనాభా పెరుగుదల వచ్చే సమస్యలు, పర్యావరణంపై ప్రభావం ఇలా ప్రతీ అంశంపై అవగాహన కల్పించేందుకు ఈ రోజును జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్యసమితి 1989లో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో భూమి మీద జనాభా 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా జనాభా దినోత్సవాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోబోతోంది. ప్రస్తుతం భూమిపై అన్ని దేశాల్లో కలిపి 796 కోట్ల జనాభా ఉంది. ఇది 2030 నాటికి 850 కోట్లకు చేరుతుందని అంచనా. అక్టోబర్ 31, 2011న ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరుకుంది.
ఈ ఏడాది ప్రపంచ జనాభా దినోత్సవ థీమ్ గా ‘‘ 8 బిలియన్ల ప్రపంచం: అందరికి స్థితిస్థాపకంగా ఉండే భవిష్యత్తు – అవకాశాలను ఉపయోగించడం, అందరికి హక్కులు’’. జూలై 11 రోజున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 45/26 తీర్మాణాన్ని ఆమోదించడంతో ప్రపంచ జనాభా దినోత్సవం మనుగడలోకి వచ్చింది. జనాభాపై అవగాహన కల్పించడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. సమానత్వం, ప్రాథమిక హక్కులు, పేదరికం, పర్యవరణం, జనాభా సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజును జరుపుకుంటారు.
Read Also: Godavari Present Water Level: ఉప్పొంగిన గోదావరి.. అన్ని గేట్ల పాక్షిక ఎత్తివేత..
జనాభా విషయానికి వస్తే క్రీస్తు శకం 1000లో ప్రపంచంలో 400 మిలియన్ల జనాభా మాత్రమే ఉండేది. 1804 లో ప్రపంచ జనాభా 100 కోట్లకు చేరుకుంది. 1960 నాటికి 300 కోట్లకు చేరుకుంది. కేవలం 40 ఏళ్లలోనే ప్రపంచ జనాభా 2000 నాటికి 600 కోట్లకు చేరుకుంది. ప్రతీ సెకనుక ప్రపంచంలో 4.2 మంది పడుతున్నారు. 1.8 మంది మరణిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 70 శాతం మంది నగరాల్లోనే జీవిస్తారని అంచనా.. ప్రపంచ జనాభా ఏడాదికి 1.10 శాతం పెరుగుతోంది. ప్రపంచ జనాభా 2050 నాటికి 980 కోట్లకు చేరుతుందని.. 2100 నాటికి 112 కోట్లకు చేరుతుందని అంచానా.