రెండు రోజుల విరామం తరువాత అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం అయింది. ఇటీవల జరిగిన వరదల కారణంగా 16 మంది చనిపోవడంతో పాటు 40 మంది గల్లంతయ్యారు. వీరి కోసం రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఓ వైపు సహాయ చర్యలు కొనసాగుతుంటే మరోవైపు అమర్ నాథ్ యాత్రకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. మంచు శివ లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు సమాయత్తం అయ్యారు. ఈ రోజు బేస్ క్యాంపు నుంచి 12వ బ్యాచ్ అమర్ నాథ్ యాత్రకు బయలుదేరుతుంది. జమ్మూ బేస్ క్యాంపు నుంచి భక్తుల బయలుదేరనున్నారు.
సోమవారం నుంచి నున్వాన్ పహల్గావ్ వైపు నుంచి అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం అయిందని.. ఈ రోజు తెల్లవారుజాము నుంచే యాత్ర ప్రారంభం అయిందని శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు తెలిపింది. బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి యాత్రికుల బ్యాచ్ నుంచి బయలుదేరుతుంది. బాల్తాల్, నున్వాన్ నుంచి హెలికాప్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఆ శివున్ని దర్శించుకనేందుకు సిద్ధంగా ఉన్నామని.. దర్శించుకోకుండా తిరిగి వెళ్లేది లేదని భక్తుల అంటున్నారు. యాత్రి తిరిగి ప్రారంభం అయినందుకు భక్తులంతా సంతోషిస్తున్నారు. సీఆర్పీఎఫ్ ఇతర సిబ్బంది భక్తులకు దిశానిర్థేశం చేస్తోంది.
Read Also: K. Laxman: దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు పో.. కేసీఆర్ కు లక్ష్మణ్ సవాల్
గత శుక్రవారం అమర్ నాథ్ పరిసర ప్రాంతాల్లో కుంభవృగా వానలు కురవడంతో పెద్ద ఎత్తున మెరుపు వరదలు సంభవించడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వరదల్లో పలువురు భక్తులు చిక్కుకుపోయారు. 16 మంది చనిపోగా.. 41 మంది గల్లంతయ్యారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్ ఇతర భద్రతా బలగాలు సహాయక చర్యలను చేపడుతున్నాయి. చాలా మందిని రక్షించారు. ఇప్పటి వరకు 35 మంది చికిత్స తీసుకుని ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ కాగా.. మరో 17 మంది చికిత్స పొందుతున్నారు.