సీఎం కేసీఆర్ పై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్ అయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన ఆయన సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నీ ప్రభుత్వం, నీ విధానాలపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని.. మేము కూడా సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ కు సవాల్ విసిరారు లక్ష్మణ్. ఎప్పుడు ఈ పీడను వదులుకుందామా, ఈ అవినీతి ప్రభుత్వాని తరిమి కొడదమా అని ప్రజలు కళ్లకు వత్తులు పెట్టుకు ఎదురుచుస్తున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షను, అశలను బీజేపీ నేరవేరుస్తుందని అన్నారు.
బీజేపీ కార్యవర్గ సమావేశాలు పూర్తి అయిన పది రోజులకు కెసీఆర్ నిద్రమత్తులో నుండి మేలుకున్నారని.. ప్రధానమంత్రిపై విమర్శలు చేయడంతో పాటు నాపై వ్యక్తిగత విమర్శలు చేయడమంటే ఆకాశంపై ఉమ్మి వేయడమే అని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైనప్పటికీ తెలంగాణ ప్రజల సమస్యల పట్ల, తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న అవినీతి, కుటుంబ పాలన పట్ల రాజ్యసభ సభను వేదిక చేసుకుని ప్రశ్నించే వ్యక్తిగా తెలంగాణ ప్రజలకు భరోసా కలిగించే రీతిలో కొనసాగుతానని అన్నారు.
Read Also: Maharashtra: శివసేన 53 ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
కేసిఆర్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై స్పందించారు. నేను సన్యాసినా..? తెలంగాణ బిడ్డనని తెలంగాణ జాతికి తెలుసున్నారు. 80వేలకు పైగా పుస్తకాలు చదివానని చెప్పుకునే కేసీఆర్ ఓ రాజకీయ అజ్ఞానిగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ బిడ్డను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిన మా నాయకుడు నరేంద్ర మోడీని ఓర్వలేక అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నవో తెలంగాణ ప్రజానీకం గమనిస్తుందన్నారు. కేసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పతనానికి చేరువలో పార్టీ కొట్టుమిట్టాడుతుందన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు కేసీఆర్ మాట్లాడుతున్నాడని విమర్శించారు.