దేశంలో నీతి వంతమైన పాలన సాగుతుంది కాబట్టే 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్థానాలను గెలుచుకున్నామని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందామని ఆయన అన్నారు. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని.. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని.. ఇటీవల జరిగిన బహిరంగ సభను చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన అన్నారు. మీ పార్టీ నాయకులు గోడ మీద ఉన్నారని.. దూకేందుకు సిద్ధం అయ్యారని ఆయన అన్నారు. కేసీఆర్ విశ్వాసఘాతుకానికి పాల్పడుతున్నాడని ఆయన విమర్శించారు.
Read Also: Bandi Sanjay: మీ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారు.. కేసీఆర్ చూసుకో..
కేసీఆర్ ఎమర్జెన్సీని కూడా పొడుతున్నాడని..రాష్ట్ర ముఖ్యమంత్రి సంస్కారం హీనంగా మాట్లాడుతున్నాడని..ముఖ్యమంత్రి స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. మీ అహంకారంలో ఏక్ నాథ్ షిండేలు తయారు అవుతున్నారని.. దీన్ని కూడా బీజేపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును దమ్ముంటే ఓడించాలని సవాల్ చేశారు. ఓ ఎస్టీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారని అన్నారు. టీఆర్ఎస్ నేతలు ద్రౌపది ముర్ముకు ఓటేసి గెలిపించాలని బండి సంజయ్ కోరారు. యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుటుంబం పరిస్థితి ఏలా ఉందో.. కేసీఆర్ కుటుంబం ఎలా ఉందో.. గమనించాలని కోరారు. రజాకార్లపై సినిమాలు వస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. తెలంగాణకు కేసీఆర్ శని తీరు దాపురించారని.. మానవ రూపంలో ఉన్న మృగం అని తీవ్రంగా విమర్శించారు.