తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఠాయికి మించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూపీ సీఎం యోగి గురించి మాట్లాడారని.. మోదీకి, యోగికి కుటుంబ రాజకీయాలు లేవని గుర్తు చేశారు. యోగీ వేసుకున్న బట్టల గురించి లుంగీ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. కుటుంబ పెత్తనం లేకుండా ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం జీవిస్తున్నారని.. కానీ మీరు మీ కుటుంబం వారసత్వం కోసం, అవినీతి కోసం, అక్రమాల కోసం, అహంకారం కోసం పాలిస్తున్నారని విమర్శించారు. ఏడాది తరువాత మీ పార్టీ ఉండది కాబట్టి ఈ ఏడాదైనా వరదలపై దృష్టి పెట్టండని..మోడిని భారతీయ జనతా పార్టీని విమర్శించడం మానెయ్యండని హితవు పలికారు.
నిరాశ, నిస్పృహలతో ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో అర్దం కానీ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అన్నారు. రానున్న మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షలు పడనున్న నేపథ్యంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యంగా వరదలను వదిలిపెట్టి పదవుల కోసం మాట్లాతున్నాడని విమర్శించారు. తెలంగాణలో కుటుంబ పాలన ఉందా.. లేదా.? అని ప్రశ్నించారు. రెండు గంటలు తిట్టడం కాదని.. తెలంగాన ప్రజలు మీ కుటుంబ పాలన పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని వదిలించుకుంటారని అన్నారు.
Read Also: Viral: హృదయవిదారక ఘటన..ఒడిలో రెండేళ్ల సోదరుడి శవంతో బాలుడు
ఎవరు వద్దన్నా,కాదన్నా కేసీఆర్ కుటుంబాన్ని, ఒవైసి కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో సహించరని అన్నారు. తెలంగాణలో 1200 మంది అమరవీరులు కల్వకుంట్ల కుటుంబం కోసం బలి కాలేదని గుర్తుపెట్టుకోవాలి అన్నారు. కేసీఆర్ తెలంగాణను చూసి నేర్చుకోవాలని.. అన్ని మేమే చేశామని.. తెలంగాణ ప్రజలకు అక్షర జ్ఞానం లేదని.. ఫామ్ హౌజులో మేమే పం్టలు పండించామని వచ్చిన డబ్బుతో తెలంగాణలను ఉద్ధరించామనే విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.