Kallakurichi Student Death: తమిళనాడులో 12 తరగతి విద్యార్థి ఆత్మహత్య తీవ్ర ఉద్రికత్తలకు కారణం అయింది. ఈ నెల 13న అనుమానాస్పద స్థితిలో మరణించిన విద్యార్థినికి మద్దతుగా విద్యార్థులు తీవ్ర హింసాత్మక ఘటలనకు పాల్పడిన సంగతి తెలిసిందే. విద్యార్థిని మరణానికి ఉపాధ్యాయులే కారణం అని స్టూడెంట్స్ తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహించిన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉంటే శనివారం విద్యార్థిని మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు అధికారులు. తమిళనాడు కడలూర్ జిల్లా ఆస్పత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా డెడ్ బాడీని విద్యార్థిని సొంత గ్రామం వెప్పూరుకు తరలించారు. గ్రామస్తులు, కుటుంబీకుల కన్నీటి మధ్య విద్యార్థి అంత్యక్రియలు జరిగాయి. బాలిక మృతదేహాన్ని చూసి ఊరంతా కన్నీటి పర్యంతమైంది.
Read Also: Congress: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు అక్రమంగా బార్ నడుపుతోంది.
ఈ నెల కలడలూర్ జిల్లా కల్లకురిచ్చి స్కూల్ విద్యార్థిని అనుమానాస్పద మరణం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కనియమూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షయల్ పాఠశాలలో చదువుతున్న బాలిక ఈ నెల 13న అనుమానాస్పద రీతిలో హస్టల్ మూడో అంతస్తు నుంచి దూకి చనిపోయింది. బాలిక మరణంతో తోలి విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాలిక మరణానికి ఉపాధ్యాయులే కారణం అని విద్యార్థులు ఆందోళనలు, నిరసనలకు దిగారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. స్కూల్ ఫర్నిచర్ తగలబెట్టడంతో పాటు స్కూల్ బస్సులను విద్యార్థులు తగలబెట్టారు. ఈ ఆందోళనను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. విద్యార్థులు పోలీసులపై కూడా దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనప సీబీ-సీఐడీ కేసు నమోదైంది. ఆందోళనలు సద్దుమణగడంతో ఈ రోజు బాలిక అంత్యక్రియలు జరిగాయి.