Arunachal Pradesh Workers Missing: మూడు వాారాలుగా అరుణాచల్ ప్రదేశ్, చైనా బోర్డర్ లో కనిపించకుండా పోయిన 19 మంది కూలీల్లో ఏడుగురు కూలీలను భారత వైమానికి దళం రెస్క్యూ చేసింది. కూలీలు కనిపించకుండా పోయిన ప్రాంతం చైనా సరిహద్దుకు అతిసమీపంలో ఉండటంతో కొంత ఆందోళన నెలకొంది. ఈ నెల ప్రారంభంలో ఎల్ఏసీ సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్ మారుమూల జిల్లా కురంగ్ కుమే జిల్లాలో అస్సాంకు చెందిన 19 మంది కూలీలు తప్పిపోయారు. ప్రస్తుతం వీరిలో ఏడుగురు కూలీలను గుర్తించారు. వీరంతా చైనా, భారత్ సరిహద్దుల్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్( బీఆర్వో) నిర్మిస్తున్న రోడ్డు పనుల కోసం అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు వచ్చారు.
అయితే ఈ నెల ఈద్ అల్-అదా జరుపుకునేందుకు అస్సాంకు తిరిగి వెళ్లడానికి కాంట్రాక్టర్ నిరాకరించడంతో కూలీలు మూడు బృందాలుగా ఏర్పడి క్యాంపు నుంచి తప్పించుకున్నారు. అయితే మారుమూల ప్రాంతం కావడంతో మూడు వారాలుగా వీరి ఆచూకీ కనుక్కోవడం కష్టం అయింది. సేర్చ్, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన భారత వైమానిక దళం హెలికాప్టర్లు హురీ సమీపంలోని డామన్ లో శుక్రవారం ఏడుగురు కూలీలను రక్షించారు. ప్రస్తుతం రక్షించబడిన కూలీలు మాట్లాడే పరిస్థితిలో లేరు. తప్పిపోయిన కూలీల్లో ఇప్పటికే ఒకరు మరణించారు. ఫురాక్ నదిలో ఒక కార్మికుడి మృతదేహాన్ని కనుక్కున్నారు. జూలై 13న స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు కురుంగ్ కుమే జిల్లా ఎస్పీ వెల్లడించారు.
Read Also: Asaduddin Owaisi: మాంసం దుకాణాల మూసివేతపై అసదుద్దీన్ ఫైర్
మిగిలిన కూలీల కోసం ఎస్డీఆర్ఎఫ్ తో పాటు వాయుసేన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ చేయబడ్డ కూలీలకు వైద్య సహాయం అందిస్తున్నారు. మిలిగిన 11 మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం చైనా- ఇండియా బోర్డర్ లో అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మితమవుతున్న రోడ్డు వ్యూహాత్మకంగా చాలా కీలకం అయినది. ఇది చైనా బోర్డర్ కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇదిలా ఉంటే కార్మికులను తీసుకువచ్చిన అస్సాం లఖీంపూర్ కు చెందిన సబ్ కాంట్రాక్టర్ పై కేసు నమోదు అయింది.