ED Raids in West Bengal: పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏకంగా రూ.20 కోట్ల నగదు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడుల్లో బయటపడింది. ఇంత పెద్దమొత్తంలో పట్టుబడటం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. పశ్చిమ బెంగాల్ త్రుణమూల్ కాంగ్రెస్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలి ఇంటి నుంచి ఈ నగదును స్వాధీనం చేసుకుంది ఈడీ. మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిపై శుక్రవారం ఈడీ దాడి చేసింది. అర్పితా ఇంట్లో నోట్లు గుట్టలు గుట్టలుగా బయటపడింది. నగదులో పాటు కీలక డాక్యుమెంట్లు, 20 సెల్ ఫోన్లు, కొన్ని రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది.
Read Also: Bandla Ganesh: తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు.. రౌడీ హీరోకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బండ్లన్న..?
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కు సంబంధించి అర్పితా ముఖర్జీ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. ప్రస్తుతం దొరికన నగదు ఎస్ఎస్సీ స్కామ్ కు సంబంధించిందిగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దమొత్తంలో నగదు దొరకడంతో నోట్లను లెక్కించడానికి బ్యాంక్ అధికారుల సహాయం తీసుకుంది ఈడీ. ఈ స్కామ్ పై ఈడీ అధికారులు త్రుణమూల్ కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిలో భారీ స్థాయిలో నగదు బయటపడింది. ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయమంత్రి పరేష్ సిఅధికారి, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య తదితరుల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. ప్రస్తుతం పార్థ ఛటర్జీ పశ్చిమ బెంగాల్ క్యాబినెట్ లో పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో నియామక ప్రక్రియ చేపట్టింది. అయితే ఆ సమయంలో నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
ED is carrying out search operations at various premises linked to recruitment scam in the West Bengal School Service Commission and West Bengal Primary Education Board. pic.twitter.com/oM4Bc0XTMB
— ANI (@ANI) July 22, 2022