రాజమహేంద్రవరంకు మాతా శిశు ప్రత్యేక సేవలు, ఉభయ గోదావరి జిల్లాల వారికి ఆధునాతన నియోనాటల్, పీడియాట్రిక్, ప్రసూతి, గైనకాలజీ, సంతానోత్పత్తి సంరక్షణ సేవలు. రాజమహేంద్రవరం & గోదావరి జిల్లా పరిసర ప్రాంత ప్రజలు మెరుగైన ఆరోగ్య సంరక్షణకు, ఆధునిక చికిత్సకు పెద్ద నగరాలకు వెళ్ళే శ్రమను తగ్గిస్తుంది.
Also Read:India-Bangladesh: “భారత ఈశాన్య రాష్ట్రాలను వేరుచేస్తాం”.. బంగ్లా రాయబారికి సమన్లు జారీ..
రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ భారతదేశంలోని ప్రముఖ పీడియాట్రిక్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ నెట్ వర్క్ కలిగిన హాస్పటల్స్ నందు పేరొందినది. ఈరోజు రాజమహేంద్రవరంలో తమ పీడియాట్రిక్, ప్రసూతి సంరక్షణకు సంబంధించిన సమగ్ర సేవలను ప్రారంభించినది. ఈ సందర్భంగా నగరంలో విలేఖరుల సదస్సును నిర్వహించి తల్లి బిడ్డ సంరక్షణా సేవల గురించి అధికారికంగా రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రకటించటం జరిగినది. దీని ఫలితంగా నగరం, పరిసర గోదావరి జిల్లాల ప్రాంత కుటుంబాల వారికి మరింత నాణ్యమైన తల్లి-బిడ్డ ఆరోగ్య సంరక్షణకు పటిష్టమైన మద్దతు లభిస్తుంది.
రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంబోత్సవం కార్యక్రమంలో రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల, డాక్టర్ దినేష్ చిర్లా, డాక్టర్ ప్రణతి రెడ్డి తో పాటుగా బ్రాహ్మణి నారా, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, హెరిటేజ్ ఫుడ్స్, తేజస్విని మతుకుమిల్లి, సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న వారు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభంతో, ఈ ప్రాంతంలో నియోనాటాలజీ, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, జనరల్ పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సబ్-స్సెపాలిటీలు, బర్త్ రైట్ ప్రసూతి, ఫీటల్ మెడిసిన్, గైనకాలజీ, ఫెర్టిలిటీ, హై-రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ వంటి తల్లిబిడ్డల సంరక్షణకు అవసరమైన అన్ని ఆధునిక వైద్య సదుపాయాలూ అందుబాటు లోకి వచ్చాయి. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బందితో పాటుగా అధునాతన క్లినికల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
విశాఖపట్నం- విజయవాడ నగరాలకు మధ్యస్థంగా చుట్టూ అనేక సంపన్న గ్రామాలతో అనుసంధానమైన నగరం రాజమహేంద్రవరం. ఇది ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్యము, వైద్య చికిత్సకు ఒక ముఖ ద్వారంగా ఉంటుంది. గతంలో ఈ ప్రాంత పరిసర ప్రాంత కుటుంబాలు వారు పిల్లల కీలకమైన వైద్యచికిత్సలకు క్లిష్టమైన కాన్పులకు సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. నగరంలో రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆవిష్కరణతో ఈ సువిశాలమైన జిల్లాలోని ప్రజలు తల్లి బిడ్డలా వైద్య సేవలకు మెట్రో నగరాలకు వెళ్ళాల్సిన అవసరం తగ్గుతుంది. ఎలాంటి ఆలస్యం, ఇబ్బందులు లేకుండా తమ సమీపంలోనే ఆధునిక చికిత్సలను పొందే అవకాశం కలుగుతుంది.
నగరంలో రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలో ఈ ఆవిష్కరణతో ఈ పరిసర ప్రాంతాలకు ఒక కీలకమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఉంటుందని, ఉభయ గోదావరి జిల్లాలలోని 200 కి.మీ పరిధిలోని కుటుంబాల వారికి అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి అన్నారు. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ భారతదేశంలో 25 సంవత్సరాల వారసత్వ అనుభవంతో అతి పెద్ద నెట్ వర్క్ కలిగి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల విశ్వాసం, గుర్తింపు పొందిన హాస్పిటల్ అని, ప్రపంచ శ్రేణి సదుపాయములతో సత్ఫలితాలను అందించే దిశగా కృషి చేస్తున్నాము అన్నారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న బ్రాహ్మణి నారా విలేఖరులతో మాట్లాడుతూ “రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం రాజమహేంద్రవరంలో తల్లిబిడ్డల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పటిష్టపరచుటలో ఒక కీలక పాత్రకు సంకేతం అన్నారు. ఈ ఆవిష్కరణతో నగరంతోపాటు పరిసర గోదావరి జిల్లాల ప్రజలకు అవసరమైన పిల్లల వైద్యం, ప్రసూతి సంరక్షణా సేవలు సమీపంలోనే లభిస్తాయని, తల్లి బిడ్డల చికిత్స కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించుటను తగ్గిస్తుందని ఆమె అన్నారు. అత్యంత ఆధునిక సదుపాయాలతో పిల్లకు చికిత్సలను అందిస్తున్న రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ను ఈప్రాంతానికి పరిచయం చేసినందుకు యాజమాన్యవర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అన్నారు.
మరో ముఖ్య అతిదిగా పాల్గొన్న తేజస్విని మతుకుమిల్లి మాట్లాడుతూ “ముందుగా ఇక్కడ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభించినందుకు డాక్టర్ రమేష్ కంచర్ల, డాక్టర్ దినేష్, డాక్టర్ ప్రణతి రెడ్డి తో సహా మొత్తం రెయిన్ బో బృందాన్ని అభినందిస్తున్నాను అన్నారు. అత్యున్నతమైన నాణ్యతా చికిత్సలను, సంరక్షణ సేవలను పొందే అవకాశం ఈ ప్రాంత ప్రజలకు కల్పించటమే కాక, తల్లి బిడ్డలకు అవసరమైన సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందని తేజస్విని చెప్పారు. రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పైన నాకు అపార విశ్వాసం ఉంది ఎందుకంటే వారు వ్యక్తిగతంగా నా స్వంత బిడ్డకు సైతం అవసరమైన అసాధారణ ప్రసూతి, శిశు సంరక్షణను అందించిన స్వీయ అనుభవం పొందాను అన్నారు.
Also Read:Vijay Rally: రేపు తమిళనాడులో విజయ్ భారీ ర్యాలీ.. సెలవు ప్రకటించిన ప్రైవేటు స్కూలు
రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ NCR, తూర్పు భారతదేశం అంతటా పటిష్టమైన హాస్పిటల్స్ నిర్వహిస్తోంది. నిరంతరంగా తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణకు ఉత్తమ సేవలను అందించు దిశగా అడుగులు వేస్తూ తన విస్తరణను కొనసాగిస్తూనే ఉంటుంది.