COVID 19 UPDATES: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత కొంత కాలంగా దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదు అయింది. అయితే తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. రోజూవారీ కరోనా కేసుల సంఖ్య తగ్గి కోలుకునే వారి సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ తో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,751 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్న ఒక్క రోజులో 16,412 మంది కోలుకున్నారు. వైరస్ వల్ల కొత్తగా 42 మంది మరనించారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.50 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,31,807గా ఉంది.
Read Also: Yogi Adityanath: యోగిని మూడు రోజుల్లో హతమారుస్తాం..
దేశంలో గత రెండున్నరేళ్ల నుంచి మొత్తం 4,41,74,650 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 5,26,772 ప్రాణాలు కోల్పోగా.. 4,35,16,071 కరోనాను జయించారు. ప్రస్తుతం కోవిడ్ రికవరీ రేటు 98.51 శాతం ఉండగా.. యాక్టివ్ కేసుల శాతం 0.30గా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 206.88 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. గడిచిన 24 గంటల్లో 31,95,034 టీకాను అందించారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. నిన్న ఒక్క రోజులో 4,92,270 మంది కరోనా బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 58,99,25,217 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య 64,38,226 చేరింది.