Dowry abuse: యూఏఈ షార్జాలో వరకట్న వేధింపులకు గురైన కేరళకు చెందిన మహిళ, తన బిడ్డను చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. మహిళ తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్లంలోని కుందార పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ప్రకారం.. జూలై 8న షార్జాలోని అల్ నవ్దాలో 32 ఏళ్ల విపంజిక మణి తన ఒకటిన్నర ఏళ్ల కుమార్తె వైభవితో చంపి, తాను తనువు చాలించింది.
Read Also: S Jaishankar: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి జిన్‌పింగ్‌ను కలిసిన జైశంకర్..
ఈ కేసులో మొదటి నిందితుడిగా విపంజిక భర్త నిధీష్ పేరు చేర్చారు. అతడి సోదరి నీతు, వారి తండ్రి తర్వాతి నిందితులుగా ఉన్నారు. వరకట్న డిమాండ్ల కారణంగా విపంజిక శారీరక, మానసిక వేధింపులకు గురైందని ఫిర్యాదు పేర్కొంది. విపంజికతో పోలిస్తే ఆమె భర్త నల్లగా ఉండటంతో, ఆమెను కూడా అందం లేకుండా కనిపించేలా చేయడానికి ఆమె జట్టు కత్తిరించినట్లు ఆమె తల్లి పేర్కొంది. ఆమెపై దాడి చేసేవాడని, ఆమెకు గుండు చేయించి రూపాన్ని మార్చాడని తెలిపింది. భర్త వివాహేతర సంబంధాలను ప్రశ్నించినప్పుడు విడాకుల నోటీసులు పంపినట్లు చెప్పింది.
నిందితుడిపై క్రూరంగా హింసించడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం, వరకట్న నిషేధిత చట్టం కింద కేసులు నమోదు చేయబడ్డాయి. విపంజిక తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో సూసైడ్ నోట్‌ని పోస్ట్ చేసింది. తన మామపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. మామ ఆగడాలను చెప్పినప్పుడు నిధీష్ పట్టించుకోలేదని, తన తండ్రి కోసమే వివాహం చేసుకున్నట్లు చెప్పాడని, నిధీష్ కొన్ని వీడియోలు చూసి, తనను కూడా అలా చేయాలని కుక్కలా హింసించాడని, కొట్టాడని, వారిని వదిలిపెట్టవద్దు అని సూసైడ్ నోట్‌లో రాసింది.