Shashi Tharoor: తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యవహారం ఆ పార్టీలో సంచలనంగా మారుతోంది. క్రమక్రమంగా పార్టీకి థరూర్‌కి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా, ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. శనివారం ఆయన మాట్లాడుతూ.. జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సహకరించుకోవాలని అన్నారు. ‘శాంతి, సామరస్యం, జాతీయ అభివృద్ధి’ అనే అంశంపై కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..
Kiren Rijiju: భారతదేశం సెక్యులర్ దేశమని, ఈ దేశంలో మైనారిటీలు అత్యంత సురక్షితంగా ఉంటున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హిందువులు మెజారిటీగా ఉండటం కారణంగానే మైనారిటీలు సంపూర్ణ స్వేచ్ఛ, రక్షణ పొందుతున్నారని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో నుంచి ఒక్క మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కూడా వలస వెళ్లడాన్ని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, దాని వావపక్ష ఎకోసిస్టమ్ మైనారిటీలను చంపుతున్నారని, కొడుతున్నారని, దేశంలో వారు సురక్షితంగా లేరని నిరంతరం తప్పుడు…
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ కఠిన పదజాలంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. మణిపూర్ సంక్షోభం గురించి పట్టించుకోకుండా మోడీ ఎక్కువగా టీవీల్లో కనిపిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని తరుచుగా మీడియాకు రావడాన్ని ఖర్గే తప్పుపట్టారు. మోడీ ప్రతీ రోజూ టీవీల్లో కనిపిస్తారని, ఆయన టీవీ స్ట్రీన్‌పై లేని రోజు లేదని, ప్రభుత్వ టెలివిజన్ దూరదర్శన్ ఉన్నప్పటికీ, గతంలో ఏ ప్రధాని కూడా రోజూ తెల్లవారుజామున టీవీల్లో మొరిగింది లేదని ఖర్గే విమర్శించారు.
Rahul Gandhi: మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో భారత్, పాకిస్తాన్ వివాదంలో మొత్తం 5 యుద్ధ విమానాలు కూలినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను నివారించినట్లు ట్రంప్ చెప్పుకుంటున్నారు. పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. అయినప్పటికీ, ట్రంప్ వినిడం లేదు. ఇదిలా ఉంటే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ వివాదానికి కారణమయ్యాయి.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ రైల్వే స్టేషన్లో రైలు టిక్కెట్లు కొనడంపై జరిగిన వాగ్వాదంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్‌పై కన్వారియాలు(శివభక్తులు) దాడికి పాల్పడ్డారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Mahindra Thar: మహీంద్రా థార్ ఇండియాలోనే టాప్ ఆఫ్ రోడర్ SUVగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. థార్‌కు ఉన్న క్రేజ్ మరే ఇతర ఆటోమొబైల్ కంపెనీల్లో ఆఫ్ రోడర్లకు రాలేదంటే అతిశయోక్తి కాదు. 4X4 ఆల్ వీల్ డ్రైవ్‌తో పాటు రియర్ వీల్ డ్రైవ్ తో థార్ వస్తుంది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. బురదలో చిక్కుకున్న మెర్సిడెస్-బెంజ్ GLE 53 కారును, మహీంద్రా థార్ బయటకు లాగుతున్న […]
Tejashwi Yadav: ఎన్నికల ముందు బీహార్ రాష్ట్రంలో పెరుగుతున్న హింసపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పరాస్ ఆస్పత్రి కాల్పులు, వ్యాపారవేత్త హత్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న హత్యలపై బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిస్సహాయంగా ఉందని అన్నారు. ‘‘బీహార్‌ని బీజేపీ తాలిబాన్‌గా మార్చింది’’ అని ఆరోపించారు. Read Also: Liquor Scam Case: క్లైమాక్స్‌కి చేరిన లిక్కర్ స్కాం […]
Maruti Suzuki e Vitara: ఎలక్ట్రిక్ కార్ల వినియోగం భారతదేశంలో పెరుగుతోంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు తమ ఫ్లాగ్షిప్ కార్లను మార్కెట్లోకి దించుతున్నాయి. తాజాగా, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ తన మొదటి ఎలక్ట్రిక్ వాహహం, ఈ-విటారాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో-2025లో మొదటిసారిగా ఈ కారును ప్రదర్శించారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE 6, MG ZS EVలకు మారుతి సుజుకి ఈ-విటారా…
Infiltrators: అక్రమంగా తమ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులపై పలు ఈశాన్య రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా, అస్సాం, త్రిపురతో పాటు చాలా ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశీ చొరబాటుదారులతో విసిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు వీరిని బహిష్కరించేందుకు చర్యల్ని ప్రారంభించాయి. ఇప్పటికే అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించి, వారు ఆక్రమించిన స్థలాలను విముక్తి చేస్తున్నారు.
Pakistan: పాకిస్తాన్‌కు ఉగ్రవాదానికి ఉన్న సంబంధాలను బయటపెట్టుకోవడంలో ఆ దేశం ఎప్పుడూ సిగ్గుపడటం లేదు. తాజాగా, పహల్గామ్ ఉగ్రవాడికి బాధ్యత వహించిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’’కు మద్దతు తెలుపుతోంది. ఏకంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీశాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో నాన్-పర్మినెంట్ సభ్యుడిగా ఉన్న పాకిస్తాన్, పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూనే, ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ప్రస్తావనను నిరోధించింది.