Redmi Note 15 Pro+: షావోమీ తన కొత్త రెడ్ మీ నోట్ 15 సిరీస్‌ను యూరప్ సహా అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని Redmi Note 15 Pro, Redmi Note 15 Pro+ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి. 200MP కెమెరా, అల్ట్రా-లార్జ్ బ్యాటరీలు, అత్యాధునిక డ్యూరబిలిటీ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్లు రెడ్ మీ బ్రాండ్‌కు ఉన్న “వాల్యూ ఫర్ మనీ” గుర్తింపును మరింత బలపరుస్తున్నాయి. అయితే, చైనా వేరియంట్లతో పోలిస్తే, గ్లోబల్ వేరియంట్లలో మెరుగైన కెమెరా ట్యూనింగ్, ఆప్టిమైజ్డ్ చార్జింగ్ అందించారు. అలాగే, “Redmi Titan Durability” కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకెళ్లుతూ.. 2.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునేలా టెస్టింగ్ చేసిన బలమైన మిడ్-ఫ్రేమ్, షాక్ అబ్సార్ప్షన్ లేయర్లు, హై-స్ట్రెంగ్త్ మదర్‌బోర్డు వంటివి ఇందులో ఉన్నాయి.
Read Also: Shambala OTT Release: ఓటీటీలోకి ‘శంబాల’ మూవీ.. ఎక్కడ చుడొచ్చంటే..?
Redmi Note 15 Pro 5G- ఫీచర్లు
* 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే
* 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3,200 నిట్స్ బ్రైట్‌నెస్
* Dolby Vision, HDR10+ సపోర్ట్
* Corning Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్
* పర్ఫార్మెన్స్ కోసం MediaTek Dimensity 7400 Ultra ప్రాసెసర్
* గరిష్టంగా 12GB RAM, 512GB స్టోరేజ్ ఆప్షన్లతో ఈ ఫోన్ వస్తుంది.
కెమెరా విభాగం:
* 200MP ప్రైమరీ కెమెరా (OISతో)
* 8MP అల్ట్రా వైడ్ కెమెరా
* 20MP ఫ్రంట్ కెమెరా
Read Also: Trump-Machado: ట్రంప్‌తో మచాడో భేటీ.. నోబెల్ శాంతి బహుమతి అందజేత
బ్యాటరీ & డ్యూరబిలిటీ:
* 6,580mAh భారీ బ్యాటరీ
* 45W ఫాస్ట్ చార్జింగ్
* IP66 / IP68 / IP69 / IP69K డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
ధర:
* 8GB + 256GB – €410 (సుమారు ₹38,000)
* 12GB + 512GB – €450 (సుమారు ₹41,000)
Redmi Note 15 Pro+ 5G- ఫీచర్లు
* Snapdragon 7s Gen 4 ప్రాసెసర్
* మెరుగైన స్పీడ్, ఎనర్జీ ఎఫిషియెన్సీ
కెమెరా హైలైట్స్:
* 200MP మెయిన్ కెమెరా (HPE సెన్సార్ – 1/1.4″ సైజ్)
* 2x / 4x ఇన్-సెన్సార్ జూమ్
* DAG HDR & అడ్వాన్స్డ్ AI ప్రాసెసింగ్
* 8MP అల్ట్రా వైడ్
* 20MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ:
* 6,500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ (10% SiC కంటెంట్)
* 100W HyperCharge
* 22.5W రివర్స్ చార్జింగ్
* Xiaomi Surge బ్యాటరీ చిప్.. ఈ బ్యాటరీ 1,600 చార్జ్ సైకిళ్ల తర్వాత కూడా 80 శాతం సామర్థ్యం కొనసాగుతుందని కంపెనీ చెబుతోంది.. అంటే సుమారు 6 సంవత్సరాల పాటు వినియోగంలో ఉంటుంది.
డ్యూరబిలిటీ:
* IP66 / IP68 / IP69 / IP69K సర్టిఫికేషన్లు
* Gorilla Glass Victus 2
* ఫైబర్‌గ్లాస్ బ్యాక్ ప్యానెల్ (ఇంపాక్ట్ అబ్సార్ప్షన్ కోసం)
ధర:
* 8GB + 256GB – €480
* 12GB + 512GB – €520.. కొన్ని మార్కెట్లలో డిస్కౌంట్లు, ట్రేడ్-ఇన్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్
* Android 15 ఆధారిత HyperOS 2
* 4 ప్రధాన Android అప్‌డేట్స్ హామీ
కలర్ ఆప్షన్లు:
* గ్లేసియర్ బ్లూ
* మోచా బ్రౌన్
* మిస్ట్ పర్పుల్
* టైటానియం
* బ్లాక్