ముంబై మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే మహాయతి కూటమి దూసుకుపోతుంది. ప్రస్తుతం బీజేపీ-శివసేన కూటమి 15 స్థానాల్లో ముందంజలో దూసుకుపోతుంది. గురువారం ముంబైలో 227 వార్డులకు ఎన్నికలు జరిగాయి. దాదాపు 54 శాతం ఓటింగ్ నమోదైంది. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అంచనాలు మధ్యాహ్నం కల్లా తెలిసిపోనుంది. ముంబైతో పాటు 29 కార్పొరేషన్లలో కౌంటింగ్ జరుగుతోంది.
ఇక పూణెలో ఒవైసీ పార్టీ ఐదు వార్డుల్లో ముందంజలో ఉంది. బీజేపీ నాలుగు వార్డులలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు.