Patriot Missile System: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఉక్రెయిన్‌కు ‘‘పేట్రియాట్’’ రక్షణ వ్యవస్థను పంపుతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసింది. ఈ పేట్రియాట్ సిస్టమ్స్ కోసం యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్ కోసం చెల్లిస్తాయని తెలుస్తోంది. జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియన్ ఉక్రెయిన్ కోసం అమెరికాకు చెల్లించే అవకాశాన్ని చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. యూఎస్ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్‌ను కలిసేందుకు వాషింగ్టన్ వెళ్తున్నారు. రష్యా నుంచి వచ్చే వైమానిక దాడుల్ని తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గత కొంత కాలంగా అమెరికా నుంచి పేట్రియాట్ వ్యవస్థను కోరుతున్నాడు.
Read Also: Tejeswar Murder case: మహానటి.. ప్రియుడి మోజులో భర్తను చంపి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని దొంగ ఏడుపు
పేట్రియాట్ వ్యవస్థ అంటే ఏమిటి?
పేట్రియాల్ ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది శత్రువుల నుంచి వచ్చే వైమానిక, డ్రోన్ ముప్పులను తిప్పికొడుతుంది. ఇది శత్రుదేశాలు మిస్సైల్స్, విమానాలు డ్రోన్లను ఇంటర్‌సెప్ట్ చేసేందుకు ఫేజ్డ్ అర్రే ట్రాకింగ్ రాడార్‌ని కలిగి ఉంటుంది. దీనిని రేథియాన్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసింది. భూమి నుంచి గాలిలోకి దూసుకెళ్లే క్షిపణులను కలిగి ఉంటుంది.
ఇది 1980ల నుంచి యూఎస్ ఆర్మీలో ఉంది. ప్రపంచంలో అత్యుత్తమన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో ఒకటిగా ఉంది. ఈ సిస్టమ్‌లో ఒక సాధారణ బ్యాటరీలో రాడార్, కంట్రోల్ సిస్టమ్, ఒక పవర్ యూనిట్, లాంచర్లు, సహాయక వామనాలు ఉంటాయి. ఇది శత్రువుల నుంచి వచ్చే ముప్పును బట్టి, అంటే విమానాలు బాలిస్టిక్ మిస్సైళ్లు, క్రూయిజ్ మిస్సైళ్లను అడ్డగించగలదు.
Read Also: Tesla: దేశంలోకి ఈ రోజే టెస్లా ఎంట్రీ.. లగ్జరీ కార్ల కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
ఇది ఎలా పనిచేస్తుంది..?
మునుపటి PAC-2 ఇంటర్‌సెప్టర్లు లక్ష్యం సమీపంలో పేలిపోయే బ్లాస్ట్ ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్ కలిగి ఉంటుంది. అయితే, PAC-3 క్షిపణులు నేరుగా లక్ష్యాన్ని ఢీకొడుతాయి. ఉక్రెయిన్‌కు ఇప్పుడు కొత్త PAC-3 CRI ఇంటర్‌సెప్టర్‌లు ఉండే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ రాడార్ 150 కి.మీ కంటే ఎక్కువ పరిధి కలిగి ఉంటుందని 2015లో నాటో తెలిపింది. పేట్రియాట్ మొదట హైపర్‌సోనిక్ ఆయుధాలను అడ్డగించడానికి రూపొందించబడలేదు. దీన్ని తయారు చేసిన సంస్థ కూడా దీనిపై ఎలాంటి విషయం చెప్పలేదు.
ఈ సిస్టమ్ ప్రస్తుతం US, జర్మనీ, పోలాండ్, ఉక్రెయిన్, జపాన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు ఈజిప్ట్ సహా 19 దేశాలకు ఎగుమతి అయింది. జనవరిలో, US ఇజ్రాయెల్ నుండి ఉక్రెయిన్‌కు దాదాపు 90 పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్‌లను బదిలీ చేసిందని కొన్ని నివేదికలు వెలువడ్డాయి. సింగిల్ పేట్రియాట్ బ్యాటరీ ధర $1 బిలియన్ కంటే ఎక్కువ, ఇందులో సిస్టమ్‌కు $400 మిలియన్లు మరియు బ్యాటరీలోని క్షిపణులకు $690 మిలియన్లు ఖర్చవుతాయి. పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్‌లు ఒక్కో క్షిపణి సుమారుగా 4 మిలియన్లు ఉంటుందని తెలుస్తోంది.