Supreme court on Freebies Case: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజు.. రాజకీయ పార్టీల ఉచితాలపై కీలక తీర్పు వెల్లడించారు. ఎన్వీ రమణ పదవీ విరమణ చివరి రోజు సందర్భంగా సుప్రీంకోర్టు వాదనల్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. దేశంలో ప్రస్తుతం కీలకంగా మారిన రాజకీయ పార్టీ ఉచితాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సమస్యను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. గత విచారణలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించామని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
అనేక రాజకీయ పార్టీలు విచారణ సందర్భంగా ఇవి ఉచితాలు కావని. ప్రజా సంక్షేమ చర్యలని వాదించాయి. ఇదే కేసులో 2013లో ఇచ్చిన తీర్పును మరోసారి పున: సమీక్షించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఉచితాల కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేసింది. ఉచితాలు ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటే తప్పా.. ఈ కేసులో ఏమీ జరగదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
Read Also: Ghulam Nabi Azad: బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్
చర్చ జరగాలి.. సమస్య తీవ్రమైనది.. దానిలో ఎటువంటి సందేహం లేదని.. అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు కలవకూడదని ప్రశ్నించింది. భారత ప్రభుత్వం సమావేశానికి పిలువచ్చని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో నిజమైన శక్తి ఓటర్లకు ఉంటుందని..ఓటర్లు, పార్టీలు, అభ్యర్థులకు ప్రజలే న్యాయనిర్ణేతలుగా ఉంటారని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఉచితాలపై చర్చ జరుగుతున్న నేపధ్యంలో పలు పార్టీలు ఉచితాలు కావు.. ఇవి ప్రజా సంక్షేమ పథకాలని చెబుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వారు ప్రజా సంక్షేమ పథకాల ప్రాధాన్యతను గురించి చెబుతున్నారు.