covid cases in india: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గతంలో కన్నా ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గినట్లే చెప్పవచ్చు. వారం రోజుల క్రితం దేశంలో రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైబడి నమోదు అయ్యేది. అయితే ప్రస్తుతం మాత్రం రోజూవారీ కోవిడ్ కేసులు 10 వేలకు అటూఇటూగా నమోదు అవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాక గణాంకాల ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 10,256 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 13,528 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో ప్రస్తుతం 90,707 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన ఒక్క రోజే కోవిడ్ వల్ల 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
Read Also: Lady Jobs Fraud; ఆ లేడీ పెద్ద కిలాడీ. ఉద్యోగాల పేరుతో అడ్డంగా ముంచేసింది
కరోనా దేశంలో ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,43,89,176 కేసులు నమోదు కాగా.. ఇందులో 5,27,556 మరణించగా.. 4,37,70,913 వ్యాధిబారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 98.61గా ఉంది. యాక్టివ్ కేసుల శాతం 0.20 శాతానికి తగ్గినట్లు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు ఇండియాలో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో అర్హులైన వారికి 2,11,13,94,639 డోసులు ఇచ్చారు. నిన్న ఒక్క రోజే 31,60,292 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇచ్చారు. గురువారం 4,22,322 మందికి కరోనా టెస్టులు చేశారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఇటలీ, తైవాన్ దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. జపాన్ లో నిన్న ఒక్క రోజే 2 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దక్షిణ కొరియాలో 1.13 లక్షల కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 60,39,97,553 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 64,82,523 మంది మరణించారు.