Gujarat: ఇంట్లో పెళ్లంటే సాధారణంగా ఏం చేస్తారు. గ్రాండ్ గా మ్యారేజ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. భోజనం దగ్గర నుంచి డెకరేషన్ వరకు గ్రాండ్ గా ఉండాలని.. బంధువులు పెళ్లిని గుర్తుంచుకోవాలని కోరుకుంటారు. ఇదిలా ఉంటే గుజరాత్ కు చెందిన ఓ పెళ్లిని మాత్రం అక్కడి ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ఎందుకంటే పెళ్లికి వచ్చిన వారిపై నోట్ల వర్షం కురిపించారు. వివరాల్లోకి వెళితే గుజరాత్ మోహసానాలో ఈ ఘటన జరిగింది. తన మేనల్లుడి పెళ్లిలో ఓ మాజీ సర్పంచ్ రూ. 500 నోట్లను వర్షంగా కురిపించారు.
Read Also: Taraka Ratna Tatoo: తారకరత్న చేతిపై బాలయ్య ఆటోగ్రాఫ్.. కన్నీరు తెప్పిస్తున్న జ్ఞాపకం
అగోల్ గ్రామ మాజీ సర్పంచ్ మేనల్లుడి వివాహ వేడుకల్లో తన ఇంటి పై నుంచి డబ్బుల వర్షం కురిపించారు. గుజరాత్ లోని కేక్రీ తహసీల్ లోని అగోల్ గ్రామానికి మాజీ సర్పంచ్ గా పనిచేసిన కరీం యాదవ్ తన మేనల్లుడు రజాక్ పెళ్లి సందర్భంగా రూ.500 నోట్లను డాబా పై నుంచి వెదజల్లాడు. ఈ వివాహ వేడుకలను చూసేందుకు గుమిగూడిన ప్రజలు వర్షంగా కురుస్తున్న నోట్లను ఏరుకునేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
బాలీవుడ్ మూవీ జోధా అక్బర్ లోని “అజీమ్-ఓ-షాన్ షెహెన్‌షా” బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, నోట్లను వెదజల్లారు. ఈ వీడియో వైరల్ కావడంతో పలువరు నెటిజెన్లు దీనిపై కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారిపై ఐటీ రైడ్స్ జరగాలంటూ మండిపడుతున్నారు.
Ex sarpanch of a village in #Gujarat, showered money on people gathered to witness his nephew's wedding celebrations,
Reportedly more than ₹50,00,000 were showered at one go. Can we expect any ‘IT Survey’ here? pic.twitter.com/mhRtbv3aUH
— YSR (@ysathishreddy) February 19, 2023