Kumaraswamy met with KCR: జేడీయూ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై ఇరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఇద్దరు నేతలు ప్రగతి భవన్ లో లంచ్ చేయనున్నారు. ఆ తరువాత సాయంత్ర 5 గంటల వరకు ఇరు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీ పెడుతారనే చర్చ నేపథ్యంలో కుమారస్వామితో కీలక భేటీ జరుగుతుండటం…
PM Modi among 15 leaders to attend SCO summit: సెప్టెంబర్ 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ హాజరుకానున్నారు. మోదీతో పాటు 15 మంది ప్రపంచ దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కోవిడ్ మహమ్మారి తరువాత ఇది మొదటి సమావేశం. చివరి ఎస్సీఓ సమావేశం 2019 జూన్…
Surat Fire Accident: గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సూరత్ నగరంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సచిన్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో ఉన్న అనుమప్ రసయాన్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉంచే కంటైనర్ లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.
Swami Vivekananda chicago speech: ప్రధాని నరేంద్ర మోదీ, స్వామి వివేకనందను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 11, 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్ లో భారత దేశ విలువను ప్రపంచానికి పరిచయం చేశారు స్వామి వివేకానంద. సెప్టెంబర్ 11తో స్వామి వివేకనందకు ప్రత్యేక అనుబంధం ఉంది. 1893లో ఇదే రోజున, ఆయన చేసిన ప్రసంగం అత్యుత్తమ ప్రసంగాల్లో ఒకటిగా నిలిచిందని.. స్వామిజీ ప్రసంగం భారతదేశ సంస్కృతి, నైతికత గురించి ప్రపంచానికి పరిచయం చేసిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Krishnam Raju: లెజండరీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణం రాజు(83) మరణంపై యావత్ సినీ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఓ గొప్ప నటుడు మరణించడంతో దేశవ్యాప్తంగా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్త విని ఒక్కసారిగా సినీలోకం, ఆయన అభిమానులు షాక్ అయ్యారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో కన్నుముశారు.
UP CM suspends 15 officials for Lucknow hotel fire incident: లక్నో హోటల్ అగ్నిప్రమాదంపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు మొదలు పెట్టారు. ఈ ప్రమాదానికి కారణం అయిన అధికారులను సస్పెండ్ చేశారు. పలు శాఖల్లోని 15 మంది అధికారులు సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల క్రితం లక్నోలోని ఓ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగి నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంపై లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ షిరాద్కర్, కమిషనర్ రోషన్ జాకబ్ తో…
Meghalaya Governor Satyapal malik comments on Rahul Gandhi: కేంద్రప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు చేస్తుంటారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్. పలు అంశాలు, సమస్యలపై కేంద్రాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో రైతు ఉద్యమం, లఖీంపూర్ ఖేరీ ఘటనపై కేంద్రాన్నికి వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం మానేస్తే తనను ఉపరాష్ట్రపతి చేస్తారని ప్రజలు సూచించారని.. ఈ సూచనలు నాకు కూడా వినిపించాయని శనివారం అన్నారు. కానీ నేను మాట్లాడకుండా…
Vande Bharat 2 Train start on sep 30: దేశంలో రైల్వేలను మరింత ఆధునీకీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. రైళ్లలో సౌకర్యాలతో పాటు ప్రజల కంఫర్ట్ ప్రధానంగా కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే దేశంలో అత్యంత స్పీడుగా ప్రయాణించే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. తాజాగా వందే భారత్ 2(వీబీ2) రైళ్లు ప్రారంభానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఈ హై స్పీడు రైలు 20 రోజుల ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది. రైల్వే సేఫ్టీ కమిషనర్( సీఆర్ఎస్) ఈ రైలుకు ఆమోదం తెలిపింది. సెప్టెంబర్…
Rahul Gandhi get a marriage proposal during Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా బలోపేతం చేసే పనిలో ఉన్నారు రాహుల్ గాంధీ. తమిళనాడులో మొదలైన రాహుల్ యాత్ర.. నిన్న రాత్రి కేరళకు చేరింది. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు.
Papua New Guinea earthquake: ద్వీపదేశం పాపువా న్యూగినియాలో ఆదివారం ఉదయం తీవ్రమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో ఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి.