Gadkari makes seatbelts mandatory for all car passengers: ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించారు. కారులో సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఇదిలా ఉంటే సైరస్ మిస్త్రీ మరణం తరువాత కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. కారులో ప్రయాణించే వారందరూ సీటు బెల్టు ధరించడాన్ని తప్పని సరి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. సైరస్ మిస్త్రీ మరణం తరువాత వెనుక సీటులో ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు.. వెనక కూర్చునే వారు కూడా సీటు బెల్టు ధరించాల్సిందే అని ఆయన అన్నారు.
ఇకపై వెనకసీట్లలో కూర్చునే వారు సీటు బెల్లు పెట్టుకోకుంటే హెచ్చరించే విధంగా అలారాన్ని ఏర్పాటు చేయాలని కార్ల తయారీ సంస్థలకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ముందు సీటులో కూర్చునే వారితో పాటు వెనకసీట్లలో కూర్చునే వ్యక్తులు తప్పనిసరిగా సీటు బెల్టును ధరించే విధంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మూడు రోజుల్లో విడుదల చేస్తామని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించనున్నారు.
Read Also: Bengaluru Floods: బెంగళూర్ లో మళ్లీ భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ.
2012-16 మధ్య టాటా గ్రూప్ చైర్మన్‌గా పనిచేసిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వారసుడు సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై-అహ్మదాబాద్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మిస్త్రీలో పాటు మరో ముగ్గురు స్నేహితులు మెర్సిడెస్ బెంజ్ కారులో ప్రమాణం అయ్యారు. ఈ నేపథ్యంలో వేగంగా వస్తున్న కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మిస్త్రీతో పాటు జహంగీర్ పండోలే అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు అనాహిత పండోలే, డారియస్ పండేలోలు గాయపడ్డారు.