Bharat Jodo Yatra.. Rahul Gandhi in another controversy: భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. గతంలో భారతదేశాన్ని, హిందూ మతాన్ని తక్కువ చేస్తూ మాట్లాడిని వివాదాస్పద క్రైసవ మతగురువు జార్జ్ పొన్నయ్యతో భేటీ అయ్యారు. అయితే దీనిపై బీజేపీ రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టింది. భారత్ తోడో( భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయండి) గుర్తులతో భారత్ జోడోనా..? అని ప్రశ్నించింది. వివాదాస్పద జార్జ్ పొన్నయ్యను రాహుల్ గాంధీ కలవడంపై బీజేపీ అధికార ప్రతినిధి హెషజాద్ పునావాలా ట్విట్టర్…
EC sends opinion to Governor on disqualification plea against Jharkhand CM’s brother: జార్ఖండ్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్ రమేష్ బైస్ కు తన అభిప్రాయాన్ని తెలిపింది. దీంతో జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మాారాయి. ఇదిలా ఉంటే గవర్నర్ రమేష్ బైస్ ఇప్పటికీ సీఎం హేమంత్ సోరెన్ అనర్హత విషయాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే…
26/11 Mumbai Terror Attacks - UN Global Congress of Victims of Terrorism: ముంబై 26/11 ఉగ్రదాడుల బాధితులు యూఎన్ మొదటి గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఆవేదనను యూఎన్ లో వినిపించారు. తమకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు ఇచ్చారు. ఈ దారుణ ఘటనలో నేను సర్వస్వం కోల్పోయానని అప్పటి తాజ్ హోటల్ మేనేజర్ గా పనిచేసిన కరంబీర్ కాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధాకరమైన ఆ నాటి చేదు ఘటన…
corona cases in india: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 5,554 కొత్త కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే 6,322 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. 18 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.7 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో పాటు మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.11 గా ఉందని తెలిపింది. మరణాల రేటు 1.19…
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తమిళనాడులో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆయన యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. నాలుగో రోజు యాత్రలో రాహుల్ గాంధీ స్వల్ప విరామం తీసుకున్నారు. ఉదయం 7 గంటలకు మూలగం నుంచి ప్రారంభం అయిన రాహుల్ గాంధీ యాత్ర 13 కిలోమీటర్ల పాటు సాగింది. దీని తరువాత స్వల్ప విరామం తీసుకుని సాయంత్రం 4 గంటలకు మళ్లీ పాదయాత్రను ప్రారంభించనున్నారు. కన్యాకుమారి…
Pramila Jayapal gets threat messages: అమెరికాలో భారతీయులపై విద్వేష దాడులు జరగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పలువురు భారతీయులపై దాడులు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికాలో కీలక స్థానంలో చట్టసభ్యురాలిగా ఉన్న ప్రమీలా జయపాల్ కు బెదిరింపులు ఎదురయ్యాయి. భారత-అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు అయిన ప్రమీలా జయపాల్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి దుర్భాషలాడారు. విద్వేషపూరిత సందేశాలు పంపాడు. వీటిని ఆమె శుక్రవారం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలని సదరు వ్యక్తి ప్రమీలా జయపాల్…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పోరులో తగ్గేది లేదు అంటున్నారు. ఇటీవల కాలంలో ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. తన బలాన్ని చూపించుకోవడానికి భారీ ఎత్తున ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ మెడకు చుట్టుకున్నాయి. ఆగస్టు 20న జరిగిన ర్యాలిలో మహిళా న్యాయమూర్తిని బెదిరిస్తూ.. వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఉగ్రవాద కేసు నమోదు అయింది.
Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమను తాము రక్షించుకోవడానికి ముందస్తు అణు దాడులకు వెనకాడం అని హెచ్చరించారు. తమను తాము రక్షించుకునే హక్కు ఉందని ఆయన అన్నారు. తమ అణ్వాస్త్ర సామర్థ్యం తిరగులేనిదని కిమ్ అన్నారు. అమెరికా చర్యలను అడ్డుకోవాలంటే అణ్వాయుధాలు ఉండాల్సిందే అని గురువారం ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో ప్రసగించారు. అమెరికా, దక్షిణ కొరియా కలిసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాయని కిమ్ ఆరోపించారు.
Daggubati Purandeswari: బీజేపీ పార్టీ పురందేశ్వరికి షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల బాధ్యతల నుంచి పురందేశ్వరిని తొలగించింది బీజేపీ నాయకత్వం. ఒడిశా రాష్ట్రంలో పదవిని తగ్గించడంతో పాటు ఛత్తీస్ ఘడ్ బాధ్యతల నుంచి తొలగించింది. ఒడిశా రాష్ట్రంలో ఇంఛార్జుగా ఉన్న పురందేశ్వరిని సహ ఇంఛార్జికి పరిమితం చేసింది. పురందేశ్వరీ వ్యవహార శైలిపై బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఈ కారణం వల్లే గత నెలలో ఒడిశా బాధ్యతలు.. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ బాధ్యతల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
Declining Rice Production: దేశంలో ఈ ఏడాది వరి ఉత్పత్తి తగ్గవచ్చని తెలుస్తోంది. అయితే ఈ సారి దేశంలో 12 మిలియన్ టన్నుల మేర వరి ఉత్పత్తి తగ్గవచ్చని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు తక్కవగా కురవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే దేశంలో ఇప్పటి వరకు వరి స్టాక్ మిగులు ఉందని వెల్లడించారు.