26/11 Mumbai Terror Attacks – UN Global Congress of Victims of Terrorism: ముంబై 26/11 ఉగ్రదాడుల బాధితులు యూఎన్ మొదటి గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ ఆవేదనను యూఎన్ లో వినిపించారు. తమకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపు ఇచ్చారు. ఈ దారుణ ఘటనలో నేను సర్వస్వం కోల్పోయానని అప్పటి తాజ్ హోటల్ మేనేజర్ గా పనిచేసిన కరంబీర్ కాంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధాకరమైన ఆ నాటి చేదు ఘటన జ్ఞాపకాలను పంచుకున్నాడు. ఈ దాడుల్లో భార్య, ఇద్దరు పిల్లల్ని కోల్పోయాడు కరంబీర్.
నా దేశం, నా నగరం, నా హోటల్ పై ఉగ్రవాదాలు 10 మంది దాడి చేశారని.. మూడు రోజుల పాటు జరిగిన ఈ విషాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. దాడి సమయంలో నా భార్య, ఇద్దరు పిల్లలు తప్పించుకోలేకపోయారని.. నేను సర్వస్వ కోల్పోయానని అన్నారు. నేను చాలా మంది సహచరులను కోల్పోయానని వెల్లడించారు. న్యాయం కోసం మేము 14 ఏళ్ల సుదీర్ఘ బాధాకరమైన ఏళ్లు గడిపామని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.
Read Also: TRS in Chennuru Constituency: గులాబీదళంలో విభేదాలు.. మరో కీలక నేత గుడ్ బై..
ముంబై ఎటాక్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉగ్రదాడుల్లో బాధితులుగా ఉన్న వారికి నివాళులు అర్పించేందుకు ఐక్యరాజ్యసమితి మొదటి గ్లోబల్ కాంగ్రెస్ ఆప్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం సమావేశాలను సెప్టెంబర్ 8-9 తేదీల్లో నిర్వహిస్తోంది. ఉగ్రదాడుల్లో బాధితులుగా ఉన్నవారి ప్రత్యక్ష అనుభవాలు, సవాళ్లను పంచుకునేందుకు ఒక వేదికను యూఎన్ అందిస్తోంది.
2008 నవంబర్ 26న పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రం గుండా వచ్చిన ఉగ్రవాదులు ముంబైతో మారణ హోమాన్ని సృష్టించారు. ముంబైలో పలు చోట్ల విధ్వంసానికి పాల్పడ్డారు. తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారిమన్ హౌజ్, ఛత్రపతి శివాజీ టెర్మినల్, కామా ఆస్పత్రి ఇలా పలుచోట్ల కాల్పలు, బాంబు దాడులకు పాల్పడ్డారు. మొత్తం మూడు రోజుల పాటు యావత్ దేశం భయాందోళనలకు లోనైంది. ఈ దాడుల్లో మొత్తం 166 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.