Asaduddin Owaisi on survey of Madrasas in UP, Uttarakhand: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కావాలనే ముస్లిం సమాాజాన్ని టార్గెట్ చేస్తున్నాయంటూ.. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మదర్సాలపై సర్వే నిర్వహిస్తున్నాయి. దీన్ని అసదుద్దీన్ వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చర్య ఉందని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.
patient was taken to the hospital in a bulldozer In madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వైద్యారోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండో నిరూపించే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో గతంలో అంబులెన్సులు లేకపోవడం, చికిత్స పొందుతూ..చనిపోయిన వారికి అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడంతో బైకుపై మృతదేహాలను సొంతూరుకు తరలించిన ఘటనలు చూశాం. గతంలో మధ్యప్రదేశ్ మొరేనా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల పిల్లవాడు.. తన రెండేళ్ల తమ్ముడి శవాన్ని ఒడిలో పెట్టుకుని కూర్చున్న ఫోటోలు దేశవ్యాప్తంగా మారాయి.
Congress is finished in Gujarat, says Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన అహ్మదాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం అయిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Sun Colour Is Actually White: మన సౌరవ్యవస్థకు మూలాధారం సూర్యుడు. మన గ్రహాలకు కావాల్సిన శక్తిని ఇస్తుంటాడు. అయితే సూర్యుడు మనకు ఎప్పుడు పసుపు రంగులోనే దర్శనం ఇస్తుంటాడు. అయితే అసలు సూర్యుడి కలర్ పసుపు రంగు కానది మాజీ నాసా వ్యోమగామి స్కాల్ కెల్లీ అంటున్నారు. సూర్యుడు తెలుపు రంగులో ఉంటాడని ధ్రువీకరించారు ఆయన. విశ్వంలో అనేక నక్షత్రాలతో పోల్చుకుంటే సూర్యుడు ఓ మరగుజ్జు నక్షత్రం. సూర్యుడితో పోలిస్తే కొన్ని వేల రెట్లు పెద్దవైన నక్షత్రాలు మన పాలపుంతతో పాటు ఇతర…
National List of Essential Medicines: జాతీయ ఆవశ్యక ఔషధాల జాబితాను రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ జాబితాలో కొత్తగా 34 రకాల మందులను చేర్చడంతో పాటు 26 మందులను తొలిగించారు. మొత్తంగా జాతీయ ఆవశ్యక ఔషధాల జాబితాలో మొత్తం ఔషధాల సంస్య 384కు చేరుకుంది. అనేక యాంటీబయాటిక్స్ తో పాటు కాన్సర్ నిరోధక మందులను ఈ జాబితాలో చేర్చారు. దీని వల్ల వీటి ధలరు మరింతగా దిగివచ్చే అవకాశం ఉంది.
Demolition of encroachments in Bengaluru: ఇండియన్ సిలికాన్ సిటీగా పేరు తెచ్చుకున్న బెంగళూరులో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆక్రమణల కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల బెంగళూర్ నగరం వరదల్లో చిక్కుకుంది. తాజాగా వరద కాల్వలను ఆక్రమించుకుని మరీ నిర్మించిన భారీ భవనాలు, అపార్ట్మెంట్ల బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తొలగిస్తోన్నారు. దీనికోసం 60కి పైగా బుల్డోజర్లు, జేసీబీలను వినియోగిస్తోన్నారు. ఇదివరకు నోటీసులు ఇచ్చిన తరువాత కూడా స్పందించని భవనాలను కూడా నేలమట్టం చేస్తోన్నారు.
Nabanna Abhiyan march in west bengal: పశ్బిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. 2021 ఎన్నికల తర్వాత బీజేపీ మంగళవారం ‘నబన్న అభియాన్’ పేరుతో పెద్ద ఎత్తున సెక్రటేరియట్ మార్చ్ కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు కోల్కతా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు ఎక్కడికక్కడ వీరిని అడ్డుకున్నారు.
Kumaraswamy met with KCR: జేడీయూ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై ఇరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఇద్దరు నేతలు ప్రగతి భవన్ లో లంచ్ చేయనున్నారు. ఆ తరువాత సాయంత్ర 5 గంటల వరకు ఇరు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీ పెడుతారనే చర్చ నేపథ్యంలో కుమారస్వామితో కీలక భేటీ జరుగుతుండటం…
PM Modi among 15 leaders to attend SCO summit: సెప్టెంబర్ 15,16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ హాజరుకానున్నారు. మోదీతో పాటు 15 మంది ప్రపంచ దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కోవిడ్ మహమ్మారి తరువాత ఇది మొదటి సమావేశం. చివరి ఎస్సీఓ సమావేశం 2019 జూన్…
Surat Fire Accident: గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సూరత్ నగరంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సచిన్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతంలో ఉన్న అనుమప్ రసయాన్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉంచే కంటైనర్ లో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.