Pramila Jayapal: భారత – అమెరికన్ చట్టసభ్యురాలికి బెదిరింపులు.. ఇండియాకు వెళ్లిపో అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pramila Jayapal gets threat messages: అమెరికాలో భారతీయులపై విద్వేష దాడులు జరగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో పలువురు భారతీయులపై దాడులు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అమెరికాలో కీలక స్థానంలో చట్టసభ్యురాలిగా ఉన్న ప్రమీలా జయపాల్ కు బెదిరింపులు ఎదురయ్యాయి. భారత-అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు అయిన ప్రమీలా జయపాల్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి దుర్భాషలాడారు. విద్వేషపూరిత సందేశాలు పంపాడు. వీటిని ఆమె శుక్రవారం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలని సదరు వ్యక్తి ప్రమీలా జయపాల్ ను బెదిరించాడు.
సాధారణంగా రాజకీయ నాయకులు తమ బలహీనతలను చూపించరు. అయితే హింసను అంగీకరించలేమని.. అందుకే ఈ వీటని పోస్టు చేయాల్సి వచ్చిందని ఆమె అన్నారు. హింసను ప్రోత్సహించే జాత్యంకార, లింగ వివక్షను మేము సహించలేమని.. ప్రమీలా జయపాల్ ట్వీట్ చేశారు. గతంలో ఓ సారి సియాటెల్ లోని ఆమె ఇంటి ముందు ఓ వ్యక్తి పిస్టోల్ తో కనిపించాడు. ఆ తరువాత అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్కు చేదు అనుభవం..
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
- Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
Read Also: Imran Khan: నన్ను అరెస్ట్ చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. ప్రభుత్వానికి ఇమ్రాన్ వార్నింగ్
చెన్నైలో జన్మించిన ప్రమీలా జయపాల్ అమెరికాలో మొట్టమొదటి భారత సంతతి చట్టసభ్యురాలు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఆమె ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)కు సియాటెల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో భారతీయులు జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. సెప్టెంబర్ 1న, కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి భారతీయ-అమెరికన్ పై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు.. అతన్ని ‘డర్టీ హిందువు’ అంటూ..అసహ్యకరమైన కుక్క అంటూ దుర్భాషలాడారు. అంతకుముందు ఆగస్టు 26న టెక్సాస్ లో నలుగురు భారతీయ మహిళపై ఓ మెక్సికో అమెరికన్ మహిళ దాడి చేసింది. ‘ఎఫ్’ అనే పదాన్ని ఉపయోగిస్తు మహిళలపై దాడి చేసింది.
Typically, political figures don't show their vulnerability. I chose to do so here because we cannot accept violence as our new norm.
We also cannot accept the racism and sexism that underlies and propels so much of this violence. pic.twitter.com/DAuwwtWt7B
— Rep. Pramila Jayapal (@RepJayapal) September 8, 2022
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!