EC sends opinion to Governor on disqualification plea against Jharkhand CM’s brother: జార్ఖండ్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్ రమేష్ బైస్ కు తన అభిప్రాయాన్ని తెలిపింది. దీంతో జార్ఖండ్ రాజకీయాలు రసవత్తరంగా మాారాయి. ఇదిలా ఉంటే గవర్నర్ రమేష్ బైస్ ఇప్పటికీ సీఎం హేమంత్ సోరెన్ అనర్హత విషయాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్‌పై కూడా వేటు తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: British Queen Elizabeth 2 : ప్రపంచంపై ప్రత్యేక ముద్ర వేసిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2
ప్రజా ప్రతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 9ఏ ప్రకారం.. మైనింగ్ సంస్థకు సహ యజమానిగా ఉన్న ఎమ్మెల్యే బసంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేసేందుకు గవర్నర్, ఈసీ అభిప్రాయాన్ని కోరారు. తాజాగా ఈసీ, గవర్నర్ కు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అయితే ఈసీ ఏలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందనేది ఇంకా తెలియరాలేదు. ప్రభుత్వ పదవుల్లో ఉండీ.. సీఎం హేమంత్ సొరెన్, బసంత్ సోరెన్లు తమకు తాము మైనింగ్ లీజులు ఇచ్చుకోవడం వివాదాస్పదం అయింది. అక్రమ పద్ధతుల్లో మైనింగ్ లీజులు పొందారని జార్ఖండ్ బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం సీఎం హేమంత్ సొరెన్ పై అనర్హత వేటు పడింది.
ఇదిలా ఉంటే గవర్నర్, సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత వేటును అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అయితే జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకే ఇలా చేస్తున్నారంటూ.. ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జేఎంఎంతో అధికారం పంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను చత్తీస్‌గఢ్ తరలించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తుందని జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నాయి.