Mohan Bhagwat: హిందూ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వరసగా ముస్లిం నేతలతో సమావేశం అవుతున్నారు. దేశంలో మతసామరస్యం పెంచేలా ముస్లింనేతలతో, మతపెద్దతలతో సమావేశం అవుతున్నారు. తాజాగా గురువారం ఢిల్లీలోని ఖిల భారత ఇమామ్ల సంఘం అధినేత ఉమర్ అహ్మద్ ఇల్యాసీతో సమావేశమయ్యారు. మోహన్ భగవత్‌ను ‘రాష్ట్ర పితా’, ‘రాష్ట్ర-ఋషి’గా పిలిచారు ఉమర్ అహ్మద్ ఇల్యాసీ.
Read Also: Naga Shaurya: నాకు కాబోయే భార్య తెలుగమ్మాయే.. పెళ్లి వార్త చెప్పిన కుర్ర హీరో
ఈ రోజు నా ఆహ్మానం మేరు మోహన్ భగవత్ జీ వచ్చారని.. అతను రాష్ట్రపిత, రాష్ట్ర బుషి అని.. అతనితో సమావేశం కావడం దేశంలో మంచి సందేశాన్ని తీసుకెళ్తుందని ఆయన అన్నారు. భగవంతుడిని ఆరాధించే పద్దతులు భిన్నంగా ఉంటాయి.. కానీ అతిపెద్ద మతం మానవత్వం అని.. ఉమర్ అహ్మద్ ఇల్యాసీ అన్నారు. హిందువులు, ముస్లిం డీఎన్ఏ ఒకటే అని ఈ సందర్భంగా మోహన్ భగవత్ అన్నారు. ఈ సమావేశంలో మోహన్ భగవత్ తో పాటు ఆర్ఎస్ఎస్ సంయుక్త కార్యదర్శి కృష్ణగోపాల్, రామ్ లాల్, ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఇంద్రేష్ కుమార్ పాల్గొన్నారు. గంట పాటు ఇల్యాసీతో మోహన్ భగవత్ చర్చించారు.
మోహన్ భగవత్ గురువారం ఢిల్లీలోని మసీదు, మదర్సాను సందర్శించి ఇల్యాసీతో చర్చలు జరిపారు. నెల రోజుల వ్యవధిలో ముస్లిం మేధావులతో మోహన్ భగవత్ సమావేశం కావడం ఇది రెండో సారి. అంతకుముందు మతసామరస్యాన్ని బలోపేతం చేసేందుకు ఐదుగురు ముస్లిం మేధావులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ ఐదుగురిలో దిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ ఉపకులపతి లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ, వ్యాపారవేత్త సయీద్ షేర్వానీ ఉన్నారు.