R Venkataramani: భారత అటార్నీ జనరల్‌గా ఆర్ వెంకటరమణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Senior advocate R Venkataramani appointed Attorney General of India: భారత అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. దేశ అత్యతున్నత న్యాయ అధికారిగా వెంకటరమణి అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఉన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీ కాలం ఈ నెల 30తో ముగియనుంది. దీంతో కొత్త అటార్నీ జనరల్ గా వెంకటరమణి బాధ్యతలు స్వీకరించనున్నారు.
వెంకటరమణి గతంలో లా కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఆమ్రపాలి హౌసింగ్ కేసులో గృహ కొనుగోలుదారులకు రిసీవర్, అమికస్ గా నియమితులయ్యారు. అటార్నీ జనరల్ గా నియమితులు అయిన వెంకటరమణి మూడేళ్ల కాలానికి పనిచేయనున్నారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గీ అటార్నీ జనరల్ బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించడంతో వెంకటరమణిని ఎంపిక చేశారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: Ahmedabad: అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులను తలదన్నేలా అహ్మదాబాద్ రైల్వేస్టేషన్.. ఫోటోలు వైరల్
1977 తమిళనాడు బార్ కౌన్సిల్ లో చేరిన వెంకటరమణి 1982 లో సుప్రీంకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1997లో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. 201లో లా కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యునిగా నియమితులయ్యారు. వెంకటరమణి సుప్రీంకోర్టులో 42 ఏళ్లు ప్రాక్టీస్ పూర్తి చేశారు. 2004 -2010 మధ్య సుప్రీంకోర్టు, హైకోర్టల్లో భారత ప్రభుత్వం వివిధ విభాగాలకు ప్రత్యేక సీనియర్ న్యాయవాదిగా కూడా ఉన్నారు. 1990లో భారత ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన సంక్షేమ చట్టాల నిపుణుల బృందంలో న్యాయ సభ్యుడిగా పనిచేశారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!