PM Modi to launch 75 digital banking units across 75 districts: దేశంలో ఆర్థిక లావాదేవీలను ప్రజలకు మరింతగా చేరువ చేసే ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రోజున 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను(డీబీయూ) ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని ప్రారంభించనున్నారు. కొత్తగా ప్రారంభిస్తున్న డీబీయూలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
Xi Jinping opens 20th Communist Party Congress: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ 20వ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ సమావేశాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో రాజధాని బీజింగ్ లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా పేరు తెచ్చుకున్న జిన్ పింగ్ మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. అక్టోబర్…
Road accident in Karnataka.. 9 people died: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ, పాల ట్యాంకర్, టెంపో ట్రావెలర్ వాహనాలు ఢీకొన్నాయి. మూడు వాహనాలు ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. టెంపో వాహనంలో ప్రయాణాస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. ఈ ఘటన శనివరాం రాత్రి 11 గంటలకు హసన్ జిల్లా బాణావర పోలీస్ స్టేషన్ పరిధిలో చెలువనహళ్లి ప్రాంతంలో జరిగింది. బస్సు, పాల ట్యాంకర్ మధ్య టెంపో వాహనం నలిగిపోవడం వల్ల…
Ebola outbreak in Uganda: ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎబోలా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోంది. ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో పూర్తిగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని. ఈ రెండు జిల్లాలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో జనాల కదలికను నిషేధిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.
20 killed in Colombia bus accident: లాటిన్ అమెరికా దేశం కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ప్రమాదం సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలోొ మొత్తం 20 మంది మరణించగా.. 14 మంది గాయపడ్డారు. బ్రేక్స్ ఫెయిల్ కావడం వల్లే బస్సు బోల్తా పడి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కొలంబియా నైరుతి ప్రాంతంలోని పాన్ అమెరికన్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.
Case against MIM party leader for making controversial remarks: ఉత్తర్ ప్రదేశ్ ఎంఐఎం అధ్యక్షుడు షౌకత్ అలీ హిందువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. దీనిపై హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. అక్బర్ జోధా బాయిని పెళ్లి చేసుకున్నాడు మనకన్నా సెక్యులర్ ఎవరు..? ముస్లింలు రెండు వివాహాలు చేసుకుంటారు.. ఇద్దరు భార్యలను గౌరవిస్తారు. అయితే హిందువులు ఒకరిని పెళ్లి చేసుకుని ముగ్గురితో ఎఫైర్స్ పెట్టుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Russia-Ukraine War: రష్యాలో ఉగ్రవాద దాడి జరిగింది. సైనిక శిక్షణా మైదానంలో ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది మరణించగా.. 15 మంది గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటన శనివారం రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న బెల్గోరోడ్ ప్రాంతంలో జరిగింది.
Hindu groups Wrote open letter to Liz Truss after Leicester violence:ఇటీవల యూకే వ్యాప్తంగా జరగుతున్న పరిణామాలు హిందువులను, భారతీయులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆసియా కప్ లో భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిన తర్వాత బ్రిటన్ లోని పలు నగరాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణ చెలరేగింది. హిందువుల ఇళ్లు, కార్లు టార్గెట్ గా రాడికల్ ముస్లింగ్రూపులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ముఖ్యంగా లిచెస్టర్ సిటీతో పాటు బర్మింగ్ హామ్ వంటి నగరాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
Aadhaar For Newborns Along With Birth Certificates In All States: నవజాత శిశువులకు బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ ఇచ్చే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో తీసుకురానుంది. ఈ మేరకు పుట్టిన వెంటనే నవజాత శిశువులకు ఇక మీదట బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి ఈ సదుపాయం దేశంలో 16 రాష్ట్రాల్లో ఉంది. అయితే ఇకపై అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు కేంద్ర సిద్ధం అయింది. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఇప్పటికే…
Indian Army sings MoU with 11 banks for Agniveer salary package: భారత సైన్యం కొత్తగా తీసుకువచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నివీర్’. ఈ పథకం కోసం ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన సాలరీ ప్యాకేజీ కోసం 11 బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇండియన్ ఆర్మీ. అగ్నివీరులకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్,